Viral Video: సింగిల్‌గా ఉందని ఎండ్రకాయను రౌండప్ చేసిన సింహాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

సింహం వేట అంటేనే మాములుగా ఉండదు. ఇతర జంతువులు ఏవైనా కూడా సింహం కంట పడ్డాయంటే వాటికి చావు తప్పదు. సరైన వ్యూహం..

Viral Video: సింగిల్‌గా ఉందని ఎండ్రకాయను రౌండప్ చేసిన సింహాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!
Lions
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 01, 2021 | 1:03 PM

సింహం వేట అంటేనే మాములుగా ఉండదు. ఇతర జంతువులు ఏవైనా కూడా సింహం కంట పడ్డాయంటే వాటికి చావు తప్పదు. సరైన వ్యూహం పన్ని ఎలాంటి జంతువునైనా మట్టి కరిపిస్తుంది. ఇలా ఒక్క సింహం దాడి చేస్తేనే ఇంతటి బీభత్సం ఉంటే.. ఒకేసారి గుంపుగా ఐదు సింహాలు దాడి చేస్తే.. ఇంకేమైనా ఉందా.! ఊహించుకోవడానికే భయంగా ఉంది కదూ.! కానీ ఇక్కడ అలాంటి సీన్ ఒకటి జరిగింది.

ఒక ఎండ్రకాయను ఏకంగా ఐదు సింహాలు రౌండప్ చేశాయి. సింగిల్‌గా ఉన్న దాన్ని ఐదు సింహాలు చుట్టుముట్టినా.. ఏమాత్రం భయపడలేదు. అసలు ఇంతకీ ఆ ఎండ్రికాయను సింహాలు ఏం చెయ్యాలనుకున్నాయో తెలుసుకునేలోపే వీడియో కాస్తా పూర్తవుతుంది. ఈ అద్భుత దృశ్యాలను రేంజర్స్‌ రగ్గిరో బారెటో, రాబిన్ సెవెల్ అనే ఇద్దరు ఫోటోగ్రాఫర్‌లు తమ కెమెరాల్లో బంధించగా.. అనూహ్యంగా అప్‌లోడ్‌ చేసిన కొద్దిసేపటికే నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మొదటిగా ఎండ్రకాయ ఇసుకలో నుంచి పైకి రాగానే.. అక్కడే ఉన్న ఓ సింహం దాన్ని పరిశీలనగా చూస్తుంది. దానినే ఫాలో అవుతూ.. కదలికలను పరిశీలిస్తుంది. ఇక కొద్దిసేపటికి మరో నాలుగు సింహాలు కూడా చేరి దాని వెనుక పడతాయి. అయితే తనను ఐదు సింహాలు రౌండప్ చేసిన విషయాన్ని అస్సలు పట్టించుకోని ఆ ఎండ్రకాయ తన దారిన తాను వెళ్లిపోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 84 వేల వ్యూస్ వచ్చాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.!

Also Read: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు..

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..