Maana Patel: టోక్యో ఒలింపిక్స్‌ పోటీలకు ఎంపికైన మానా పటేల్.. తొలి భారత మహిళా స్విమ్మర్‌‌గా రికార్డు..

India's First Female Swimmer: టోక్యో ఒలింపిక్స్ పోటీలకు మహిళా స్విమ్మర్ మానా పటేల్ ఎంపికయ్యారు. భారతదేశం నుంచి ఒలింపిక్స్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొననున్న.. మొట్టమొదటి మహిళా స్విమ్మర్ గా నిలిచారు మానా పటేల్.

Maana Patel: టోక్యో ఒలింపిక్స్‌ పోటీలకు ఎంపికైన మానా పటేల్.. తొలి భారత మహిళా స్విమ్మర్‌‌గా రికార్డు..
Maana Patel
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 02, 2021 | 2:02 PM

టోక్యో ఒలింపిక్స్‌కు భారత స్విమ్మర్‌ మానా పటేల్‌ అర్హత సాధించారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా స్విమ్మర్‌గా రికార్డు సృష్టించారు. శ్రీహరి నటరాజన్, సజన్ ప్రకాష్​ల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత స్విమ్మర్ మానా పటేల్‌ చరిత్ర సృష్టించారు. ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. అహ్మదాబాద్‌కు చెందిన బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మర్ పటేల్.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారని తెలిపారు. యూనివర్శిటీ కోటా నుంచి అర్హత సాధించిన మానా పటేల్‌ను కిరణ్ రిజిజు అభినందించారు. మానా పటేల్.. ఒలింపిక్స్​కు అర్హత పొందిన తొలి భారత మహిళ స్విమ్మర్​ కావడం గర్వంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు.

2019లో గాయంతో ఆట నుంచి వైదొలిగిన మానా పటేల్.. మళ్లీ ఈ ఏడాది ప్రారంభంలో తిరిగి ఫామ్‌లోకొచ్చారు. బెల్​గ్రేడ్ వేదికగా ఇటీవల జరిగిన 100 మీటర్ల ఈత పోటీల్లో మానా పటేల్ జాతీయ రికార్డు నెలకొల్పారు. ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌లో వంద మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు.

21 ఏళ్ల మానా పటేల్ జాతీయ క్రీడల్లో 50 బ్యాక్ స్ట్రోక్, 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. మానా పటేల్ 60వ నేషనల్ గేమ్స్ లో 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీలో స్వర్ణం సాధించి జాతీయ రికార్డును బద్దలు కొట్టారు. పటేల్ 72 వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో మూడు బంగారు పతకాలు సాధించారు. 2018 లో తిరువనంతపురంలో జరిగిన సీనియర్ నేషనల్స్‌లో పటేల్ మూడు బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లను కైవసం చేసుకున్నారు.

తాజాగా ఒలింపిక్స్​కు అర్హత సాధించాననే విషయం తనకో అద్భుతమైన అనుభూతిగా పేర్కొన్నారు మానా పటేల్‌. తన కొలీగ్స్‌ నుంచి ఈ విషయం తెలుసుకున్నానని..వరల్డ్‌ బెస్ట్‌ కాంపిటీటర్స్‌తో పాల్గొనేందుకు ఎదురుచేస్తున్నట్లు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో 1 నిమిషం 02 సెకన్లు లేదా అంతకంటే తక్కువ సమయం తీసుకోవడమే తన లక్ష్యమంటున్నారు.

ఇవి కూడా చదవండి: Drug Racket: నిన్న టెర్రర్ లింక్.. ఇవాళ డ్రగ్స్ మాఫియా.. ఇద్దరు విదేశీ విద్యార్థులు అరెస్ట్

Hyderabad Metro Timings: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక పరుగుల సమయం మారింది.. గమనించారా..