Tokyo Olympics 2021: జపాన్‌లో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. ఒలంపిక్స్ నిర్వాహకుల్లో ఆందోళన
Tokyo Olympics 2021: ఓ వైపు జపాన్ రాజధాని టోక్యోలో ఒలంపిక్స్ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూ ఆందోళన...
Tokyo Olympics 2021: ఓ వైపు జపాన్ రాజధాని టోక్యోలో ఒలంపిక్స్ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడకు అనేక దేశాల నుంచి వందలాది క్రీడాకారులు చేరుకోనున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతుండడం.. ఒలంపిక్స్ నిర్వాహకులకు ఆందోళన కలిగిస్తుంది. కానీ..
కరోనా నివారణ కోసం విధించిన హెల 21 వరకూ టోక్యోలో ఎమర్జెన్సీ ఉంది. అయితే.. టోక్యో ఒలింపిక్స్ నేపథ్యంలో.. దాన్ని ఎత్తివేయగా.. అప్పటి నుంచి క్రమంగా రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గత వారం వరకూ రోజుకి సగటున 500 వరకూ వచ్చిన కేసులు.. గత రెండు రోజుల క్రితం ఒక్కరోజే జపాన్‌లో 1821 కేసులు నమోదవగా.. ఇందులో టోక్యోలో నమోదైనవే 714 కావడం గమనార్హం దేశం మొత్తం మీద నమోదవుతున్న కేసుల్లో ఏకంగా 40 శాతం కేసులు టోక్యోలోనే నమోదవుతున్నాయి. దాంతో.. ఒలింపిక్స్ నిర్వహణ కత్తిమీద సాములా కనిపిస్తోంది. మే 26 తర్వాత అక్కడ రోజులో 700 కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
ఈనేపధ్యంలో ఒలింపిక్స్ ఆటలు ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారని తెలుస్తోంది. “మేము జపాన్ ప్రజల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఈ మేరకు అక్కడ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అంతేకాదు “టోక్యో తో పాటు ఇతర ప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి.. [ప్రభుత్వం తీసుకునే నివారణ చర్యల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని ప్రజలు పిలుపునిచ్చారు.
Also Read: పాకిస్థాన్‌లోని భారత ఎంబసీ వద్ద డ్రోన్ కలకలం.. ఆగ్రహం వ్యక్తంచేసిన భారత్..