Drug Racket: నిన్న టెర్రర్ లింక్.. ఇవాళ డ్రగ్స్ మాఫియా.. ఇద్దరు విదేశీ విద్యార్థులు అరెస్ట్

Drugs smuggling: హైదరాబాద్‌లో ఓ వైపు టెర్రర్‌ లింక్‌లు..మరో వైపు డ్రగ్స్‌ మాఫియా ..పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. మాలిక్‌ బ్రదర్స్‌ ఎపిసోడ్‌ ఇంకా పూర్తి కాకముందు...రాజేంద్రనగర్‌లో డ్రగ్‌ రాకెట్‌ బయటపడింది.

Drug Racket: నిన్న టెర్రర్ లింక్.. ఇవాళ డ్రగ్స్ మాఫియా.. ఇద్దరు విదేశీ విద్యార్థులు అరెస్ట్
Drugs Seized Heavily In Raj
Follow us

|

Updated on: Jul 02, 2021 | 8:34 AM

హైదరాబాద్‌లో ఓ వైపు టెర్రర్‌ లింక్‌లు..మరో వైపు డ్రగ్స్‌ మాఫియా .. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. మాలిక్‌ బ్రదర్స్‌ ఎపిసోడ్‌ ఇంకా పూర్తి కాకముందు.. రాజేంద్రనగర్‌లో డ్రగ్‌ రాకెట్‌ బయటపడింది. సూడాన్‌, యెమెన్‌ దేశస్థుల డ్రగ్స్‌ సప్లయి చేస్తూ పట్టుబడ్డారు. మంత్రా మాల్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తూ ఇద్దరు విద్యార్థులు పోలీసులకు చిక్కారు. యువతను టార్గెట్‌ చేసి డ్రగ్స్‌ విక్రయిస్తున్నారు ఈ నిందితులు. నిందితుల నుంచి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు….ఈ ముఠా సభ్యుల కోసం ఆరా తీస్తున్నారు.

లాక్‌డౌన్‌ ఇప్పుడిప్పుడే తెరుచుకోవడంతో డ్రగ్స్‌ నగరానికి భారీగా చేరుకుంటున్నాయి. ఇలాంటి వాసన ముందే పసిగట్టిన అధికారులు ఎక్కడికక్కడ ఈ డ్రగ్స్ సరఫరాకు బ్రేక్‌ వేస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయంగా డ్రగ్స్‌ సరఫరా పెరిగిందన్న నిఘా వర్గాల సమాచారంతో అధికారులు.. నిఘాను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే రాజేంద్రనగర్‌లో భారీగా డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు సుడాన్ యెమెన్ దేశస్థులను పోలీసులు పట్టుకున్నారు.

ఉప్పర్‌పల్లి వద్ద మంత్రా మాల్‌లో డ్రగ్స్ విక్రయిస్తూ ఇద్దరు విద్యార్థులు రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికి పోయారు. యువతను టార్గెట్ చేసి వారికి డ్రగ్స్ విక్రయిస్తున్నారని పక్కా సమాచారం మేరకు మంత్రా మాల్ వద్ద మాటు వేసిన శంషాబాద్ ఎస్ఓటి బృందం.. పక్కా ప్లాన్‌తో దాడి చేశారు. బంజారా హిల్స్‌లో నివాసం ఉండే ఈ ఇద్దరు విదేశీయులు వారి వద్ద ఉన్న డ్రగ్స్‌ను తీసుకొని రాజేంద్రనగర్‌కు చేరుకున్నారు. అక్కడి వచ్చిన మరో ఇద్దరికి వీటిని అందిస్తున్న సమయంలో సినిమా ఫక్కీలో పట్టుకున్నారు పోలీసులు. ఈ ఇద్దరు విదేశీయుల వద్ద ఉన్నముద్దల రూపంలో ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ ఇంకా తెలియాల్సి ఉంది. డ్రగ్స్ ఎక్కడి నుండి తెచ్చారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి: Hyderabad Metro Timings: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక పరుగుల సమయం మారింది.. గమనించారా..

Wimbledon 2021 Day 4 Highlights: సానియా జోడీ శుభారంభం; ఫెదరర్ ముందంజ.. స్వితోలినా పోరాటానికి తెర!