AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. మొసలితో ఆ పిచ్చి గేమ్స్‌ ఏంటి అమ్మాయి.? వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

సోషల్ మీడియా ప్రపంచం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ప్రపంచం నలమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో..

Viral Video: వామ్మో.. మొసలితో ఆ పిచ్చి గేమ్స్‌ ఏంటి అమ్మాయి.? వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
Crocodile
Ravi Kiran
|

Updated on: Jul 02, 2021 | 12:38 PM

Share

సోషల్ మీడియా ప్రపంచం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ప్రపంచం నలమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక నెట్టింట్లో చక్కర్లు కొట్టే కొన్ని వీడియోలు షాక్‌కు గురి చేస్తూ ఉంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

నీటిలో మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుందంటారు. నీళ్లలో ఎంతటి బలమైన జంతువులైనా దాని ముందు తల వంచాల్సిందే. అందుకే మొసలిని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తుంటారు. మరి ఇలాంటి క్రూర జంతువుతో ఎవరైనా ఆటలు ఆడతారా.? అంత ధైర్యం ఉంటుందా.? తాజాగా ఓ అమ్మాయి మొసలితో గేమ్స్ ఆడింది. ధైర్యంగా దాని నోట్లో చెయ్యి పెట్టింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదొక ‘జూ’లా అనిపిస్తోంది. ఎవరో ఏదో మత్తు మందు ఇచ్చినట్లుగా మొసలి చాలా ప్రశాంతంగా ఓ చోట సేద తీరుతూ ఉండటం మీరు వీడియోలో చూడవచ్చు. అలాంటి పరిస్థితిలో కేర్ టేకర్ అయిన ఓ యువతి మొసలి నోట్లో చెయ్యి పెడుతుంది. ఇంతలో అనూహ్యంగా మొసలి దాన్ని కొరకడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈలోపే ఆ యువతి తన చేతిని వెనక్కి లాక్కోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా, ఈ షాకింగ్ వీడియోను ‘Safarismyjam’ అనే యూజర్ ఇన్‌స్టాలో షేర్ చేయగా.. దాన్ని చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటిదాకా 20 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.

Also Read: 

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు..

సింగిల్‌గా ఉందని ఎండ్రకాయను రౌండప్ చేసిన సింహాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

టీమిండియాపై ట్రిపుల్ సెంచరీ.. 48 బంతుల్లో శతకం.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆ ఓపెనర్ ఎవరంటే.!

రెస్టారెంట్‌ను పేల్చేస్తానంటూ కస్టమర్ ఫోన్.. కారణం ఆరా తీయగా మైండ్ బ్లాంక్.!

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల