Oil India Limited Recruitment: ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.
Oil India Limited recruitment 2021: ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు...
Oil India Limited recruitment 2021: ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారు అసోంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ కేంద్ర కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. దేశంలోని రెండో అతిపెద్ద ఆయిల్ కంపెనీ అయిన OILలో ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన ఏదైనా ప్రభుత్వ బోర్డు నుంచి 40 శాతం మార్కులతో 10+2 పూర్తి చేయాలి. అలాగే కంప్యూటర్ అప్లికేషన్‌లో కనీసం ఆరునెలల డిప్లొమా/సర్టిఫికేట్‌ను కలిగిఉండాలి. ఎమ్‌ఎస్ వర్డ్, ఎమ్‌ఎస్ ఎక్సెల్, ఎమ్‌ఎస్ పవర్‌పాయింట్‌పై పరిజ్ఞానం ఉండాలి. * పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. * ఎస్‌సీ/ఎస్టీ అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్లు ఉండొచ్చు. ఓబీసీ వారికి 33 ఏళ్‌లవరకు అవకాశం కల్పించారు.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఎంపికైన అభ్యర్థులకు రూ. 26,600 నుంచి 90,000 వరకు జీతంగా అందిస్తారు. * దరఖాస్తుల స్వీకరణ 15-08-2021 నాటికి ముగియనుంది.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
* అభ్యర్థులు ముందుగా https://www.oil-india.com వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. * అనంతరం కెరీర్స్ ఆప్షన్‌లోకి వెళ్లి.. కరెంట్ ఓపెనింగ్స్‌పై క్లిక్ చేయాలి. * తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్టుపై క్లిక్ చేసి పూర్తి వివరాలను అందించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. * అనంతరం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
YS Jagan Biopic: సీఎం వైఎస్ జగన్ బయోపిక్.. హీరోగా ప్రీతిక్ గాంధీ.? త్వరలోనే అధికారిక ప్రకటన.!