Telugu News » Photo gallery » Technology photos » China mobile manufacturing company oppo launching new two smartphones in reno series have a look on features and price details
Oppo Reno 6: ఒప్పో నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్‌లు.. అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటోన్న ‘రెనో’ సిరీస్..
Oppo Reno 6: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఇప్పటికే చైనాలో విడుదల చేసిన ఈ ఫోన్‌లను జులై 14న భారత్‌లో విడుదల చేయనున్నారు. మరి ఈ ఫోన్‌లకు సంబంధించిన ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయంటే..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో భారత్‌లో మంచి బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుంది. ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తోన్న ఒప్పో తాజాగా మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది.
1 / 6
రెనో సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 6, ఒప్పో రెనో 6 ప్రో ఫోన్‌లను మే 27న చైనాలో లాంచ్ చేసింది. ఇక ఈ ఫోన్‌లను భారత మార్కెట్లో జులై 14న విడుదలచేయనున్నారు.
2 / 6
5జీ మోడల్స్‌లో వచ్చిన ఒప్పో రెనో 6, రెనో 6 ప్రో ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇక రెనో 6లో 6.43 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ+అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. రెనో 6 ప్రోలో 6.55 ఇంచెస్ స్క్రీన్‌ను పొందుపరిచారు.
3 / 6
ఇక కెమెరా విషయానికొస్తే ఒప్పో ఈ రెండు మోడల్స్‌లో 64 మెగాపిక్సెల్ (రెయిర్ కెమెరా), 32 మెగాపిక్సెల్ (సెల్ఫీ) కెమెరా అందిస్తున్నారు.
4 / 6
స్టోరేజ్ విషయానికొస్తే.. 12 జీబీ ర్యామ్+256 జీబీ ఇంటర్ననల్ స్టోరేజీని అందించారు. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 11.3పై పనిచేస్తాయి.
5 / 6
ఒప్పో రెనో 6 ధర రూ. 31,800, ఒప్పో రెనో 6 ప్రో ధర రూ. 39,800గా ఉండనున్నట్లు తెలుస్తోంది.