- Telugu News Photo Gallery Technology photos Micro blogging site twitter planning to bring new two features trusted tweet and face it by this user can hide his tweets
Twitter New Features: రెంచు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న ట్విట్టర్.. ఇకపై మీ ట్వీట్ ఎవరికి కనిపించాలో కంట్రోల్ చేసుకోవచ్చు.
Twitter New Features: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫ్లామ్‌లలో ట్విట్టర్ మొదటి వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే ట్విట్టర్ తాజాగా యూజర్ల అవసరం దృష్ట్యా మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా..
Updated on: Jul 03, 2021 | 7:03 AM

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫ్లామ్ ట్విట్టర్ కొత్తగా రెండు ఫీచర్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో ఒకటి ట్రస్ట్‌డ్ ఫ్రెండ్స్ కాగా మరొకటి ఫేస్ ఇట్ ఫీచర్.

మొదటి ఫీచర్ అయిన ట్రస్ట్‌డ్‌తో చేసే ట్వీట్‌ను మనం ఎంచుకున్న వారికి మాత్రమే కనిపించేలా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇలాంటి ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీటిలో పోస్ట్ చేసే స్టోరీలు, స్టేటస్‌లు మనకు నచ్చిన వ్యక్తులకు మాత్రమే కనిపించేలా సెట్ చేసుకోవచ్చు.

ఇక ట్రస్ట్‌డ్ ట్వీట్లను ట్వీట్ చేసే వారే ముందుగా చూసుకునే వెసులుబాటును ట్విట్టర్ కలిపిస్తోంది. దీనిపై కూడా ట్వి్ట్టర్ దృష్టి సారిస్తోంది.

ట్విట్టర్ తీసుకురానున్న మరో ఫీచర్ ఫేస్ ఇట్. దీనిద్వారా ట్వీట్లను కేటగిరిలాగా విభజించుకునే అవకావం కల్పించనున్నారు. దీంతో పర్సనల్, ప్రొఫెషనల్ ఎకౌంట్ల ట్వీట్లను కేటగిరైజేషన్ చేసుకోవచ్చని తెలిపింది.

ఈ రెండు కొత్త ఫీచర్లకు సంబంధించి ట్విట్టర్ సూచనప్రాయంగా తెలిపింది. మరికొన్ని రోజుల్లోనే ట్విట్టర్ ఈ రెండు కొత్త ఫీచర్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.




