- Telugu News Photo Gallery Technology photos Online video platform google meet introduce new features by this at a time one lakh people can join in meeting and captions
Google Meet New Feature: అదిరిపోయే కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన గూగుల్ మీట్.. ఇకపై ఒకేసారి ఏకంగా లక్షమంది..
Google Meet New Feature: ఆఫీసులు, పాఠశాలలు మూతపడడంతో గూగుల్ మీట్ వంటి ఆన్‌లైన్ వీడియో ఫ్లాట్‌ఫామ్‌లకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే యూజర్లను ఆకట్టుకునే ఉద్దేశంతో గూగుల్ మీట్ సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్లతో కలిగే ప్రయోజనాలేంటో చూడండి..
Updated on: Jul 04, 2021 | 6:49 AM

కరోనా తదనంతర పరిణామల తర్వాత ఆన్‌లైన్ వీడియో ఫ్లాట్‌ఫామ్‌లకు బాగా డిమాండ్ పెరిగింది. మరీ ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచి తరగతులు వినడం వంటి వాటితో ఇది మరింత ఎక్కువైంది.

ఇక యూజర్ల ఈ కొత్త అవసరాన్ని ఒడిసిపట్టుకుంటోంది గూగుల్. ఈ క్రమంలోనే గూగుల్ మీట్‌లో కొత్తగా కొన్ని ఫీచర్లను తీసుకొచ్చింది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఒకేసారి లక్షమంది సమావేశం కావొచ్చు. ఇక గూగుల్ మీట్‌ను హోస్ట్ చేసిన వ్యక్తి కొత్త డొమైన్ ద్వారా మరికొందరిని సమావేశానికి ఆహ్వానించే సౌకర్యాన్ని తీసుకొచ్చారు.

దీనిద్వారా ఓవైపు మీటింగ్‌లో ఉంటూనే క్రాస్ డొమైన్ లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా క్యాప్షన్స్‌ను కూడా జోడించే వెసులుబాటు కలుగుతుంది.

క్యాప్షన్స్ యాడ్ చేయడం ద్వారా వినికిడి లోపం ఉన్న వారికి ఉపయోగపడుతుంది. అలాగే ఆడియో ఆఫ్ చేసిన తర్వాత కూడా సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.




