Almonds Benefits: రోజూ ఎన్ని బాదంపప్పులు తినాలి.? అతిగా తింటే ఏమవుతుంది.! ఈ విషయాలు తెలుసుకోండి

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎలప్పుడూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలని డాక్టర్స్ సూచిస్తుంటారు...

Almonds Benefits: రోజూ ఎన్ని బాదంపప్పులు తినాలి.?  అతిగా తింటే ఏమవుతుంది.! ఈ విషయాలు తెలుసుకోండి
Almonds
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 02, 2021 | 5:33 PM

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎలప్పుడూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలని డాక్టర్స్ సూచిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలామంది నట్స్, సీడ్స్ తింటుంటారు. నట్స్‌లో ఎక్కువమంది బాదంపప్పులను ఇష్టంగా తింటారు. బాదాంపప్పుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఈ బాదంపప్పులను ఉదయాన్నే నానబెట్టి తింటే.. జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇవి రోగనిరోధక శక్తి పెరగడంలో కూడా బాగా తోడ్పడతాయి. మరి రోజుకు ఎన్ని బాదాంలను తినాలి.? ఎలా తినాలి.? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బాదాంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వాటిని రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు. రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించడమే కాకుండా హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. అలాగే శరీరంలో కాల్షియం స్థాయిని కూడా పెంపొందిస్తుంది. అటు డయాబెటిస్ బాధితులు బాదంపప్పులు రోజూ తినడం చాలా మంచిది.

ఇదిలా ఉంటే శరీరానికి మేలు చేస్తుంది కదా అని చెప్పి.. మోతాదుకి మించి ఏదీ తీసుకోకూడదు. ప్రతీరోజూ ఏ ఆహారమైనా అధిక మోతాదులో తీసుకుంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇదే సూత్రం బాదాంలకు కూడా వర్తిస్తుంది. రోజుకు 8 నుంచి 10 బాదం పప్పులను తినమని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే బాదాంలను నేరుగా తినకుండా నీటిలో నానబెట్టి ఏడు లేదా ఎనిమిది నిమిషాల తర్వాత తొక్క తీసి తింటే మంచిదట.

అతిగా బాదాం తినడం వల్ల ఏం జరుగుతుంది…

బాదాంలో ఎన్నో పోషకాలు ఉంటాయని.. ఆరోగ్యానికి చాలా మంచిదని మోతాదుకు మించి తింటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని వైద్యులు అంటున్నారు. శరీరంలో కొవ్వు పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జీర్ణక్రియ సమస్య వంటివి తలెత్తవచ్చునని డాక్టర్లు అంటున్నారు.

Also Read: 

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు..

సింగిల్‌గా ఉందని ఎండ్రకాయను రౌండప్ చేసిన సింహాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

టీమిండియాపై ట్రిపుల్ సెంచరీ.. 48 బంతుల్లో శతకం.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆ ఓపెనర్ ఎవరంటే.!

రెస్టారెంట్‌ను పేల్చేస్తానంటూ కస్టమర్ ఫోన్.. కారణం ఆరా తీయగా మైండ్ బ్లాంక్.!

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌