Urvashi Rautela: వయ్యారాల ఊర్వశి రౌతేలా…. బాపుగారి బొమ్మలా ఎంత చక్కగా ముస్తాబైందో.. ఒంటిపై 62 లక్షల ఖరీదైన..
కొత్తగా వస్తున్న ఫ్యాషన్ హంగులను ప్రజలకు పరిచయం చేయడంలో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా ముందుంటారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఊర్వశి రౌతేలా
కొత్తగా వస్తున్న ఫ్యాషన్ హంగులను ప్రజలకు పరిచయం చేయడంలో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా ముందుంటారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఊర్వశి రౌతేలా ఎప్పటికప్పుడు మోడ్రన్ యువతిగా కనిపిస్తూనే … ఇటు భారతీయ సంప్రదాయపు అమ్మాయిగా కనిపిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అందులో ఊర్వశి.. ఆకుపచ్చ లెహంగాలో.. అభరణాలు ధరించి.. అందగా ముస్తాబై నిల్చుంది.
బాలీవుడ్ యాక్టర్ మనోజ్ కుమార్ మనవరాలు ముస్కాన్ వివాహ వేడుకలో ఊర్వశి రౌతేలా సంప్రదాయపు దుస్తులలో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఊర్వశి ధరించిన లెహంగాను.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆశా గౌతమ్ డిజైన్ చేశారు.. ఆ లెహంగాను.. పూర్తిగా రాజస్థానీ బంధానీ మోడల్లో చేతితో తయారు చేశారు. లెహంగాలో మూడు రంగుల షెడ్స్ వచ్చేలా రూపొదించారు. స్కైబ్లూ, గ్రీన్, గోధుమ రంగలను కలసి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆ లెహంగా ధర రూ. 4 లక్షలు ఖరీదు. అంతేకాదు.. నటి శోభా ష్రింగర్ జ్యువెల్లరి నుంచి రాయల్ స్టడెడ్ ఆభరణాలను ధరించింది.. వీటి ధర ఏకంగా రూ.58 వేలు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఊర్వశి రౌతేలా భారతీయ సంప్రదాయపు చీరకట్టుతో స్త్రీ శక్తి అవార్డు వేడకలకు హాజరైన సంగతి తెలిసిందే.
ఇక ఊర్వశి రౌతేలా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ బ్యూటీ. అటు డిజిటల్ ఫ్లాట్ ఫాంపై కూడా ఊర్వశి తన సత్తా చూపిస్తోంది.
ట్వీట్..
View this post on Instagram
Tragedy: వెంటాడిన విధి.. ఆ తల్లి తన ముద్దుల బిడ్డను కొబ్బరి చెట్టు కింద పడుకోబెట్టింది.. అంతలోనే