AP CM YS Jagan Review on Disha Act: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన దిశ చట్టం ఆమోదించాలంటూ శుక్రవారం సీఎం జగన్ లేఖ ద్వారా స్మృతి ఇరానీని కోరారు. దిశ బిల్లు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా, ‘దిశ’ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. సమీక్షలో భాగంగా దిశ చట్టానికి సంబంధించి కేంద్ర మంత్రికి జగన్ లేఖ రాశారు. కాగా ఈ సమావేశానికి హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Cm Ys Jagan Letter To Uion Minister Smriti Irani
ఇక, కేసుల దర్యాప్తు విషయంలో అలసత్వం వద్దన్న సీఎం.. ప్రభుత్వం, పోలీసులపై దుష్ప్రచారం చేస్తున్న ఘటనల్లో.. నిజాలను ప్రజల ముందుంచాలన్నారు. బాధితులను ఆదుకునే విషయంలో ఆలస్యం జరగకూడదని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో… ప్రీతి సుగాలి కుటుంబాన్ని ఆదుకునే విషయంలో… తీసుకునే చర్యలను అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ‘‘ప్రీతి సుగాలి తండ్రికి ఉద్యోగం ఇస్తున్నామని. ప్రీతి తల్లి కోరుకున్నట్లే ఆమెను కర్నూలు డిస్పెన్సరీలోనే కొనసాగిస్తున్నాం. 5 సెంట్ల ఇంటి పట్టా, ఐదెకరాల భూమిని కూడా ఇస్తున్నాం’’ అని ముఖ్యమంత్రికి తెలిపారు.
Read Also…. Indian Woman fly into space: అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. స్పేస్ ఫ్లేస్ సంపాదించిన గుంటూరు యువతి