AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada Murder Case: హత్య చేస్తాడన్న భయంతోనే చంపేశారు.. దుర్గా అగ్రహారం మర్డర్ కేసును ఛేదించిన..

విజయవాడ నగరంలో సంచలనం సృష్టించిన వ్యక్తి హత్య కేసులో‌ పోలీసులు ఛేదించారు. సాంకేతిక ఆధారాలతో ఈ కేసుతో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్టు చేస్తున్నట్లు డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.

Vijayawada Murder Case: హత్య చేస్తాడన్న భయంతోనే చంపేశారు.. దుర్గా అగ్రహారం మర్డర్ కేసును ఛేదించిన..
Vijayawada Murder Case
Balaraju Goud
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 02, 2021 | 6:19 PM

Share

Vijayawada Police Chased Durga Agraharam Murder Case: విజయవాడ నగరంలో సంచలనం సృష్టించిన వ్యక్తి హత్య కేసులో‌ పోలీసులు ఛేదించారు. సాంకేతిక ఆధారాలతో ఈ కేసుతో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్టు చేస్తున్నట్లు డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి ఎక్కడ చంపుతాడోనని, ముందుగానే అతడిని మట్టుపెట్టిన ఘటన విజయవాడలో పట్టపగలు జరిగిందని పోలీసులు తెలిపారు.

విజయవాడ నగరంలోని దుర్గా అగ్రహారంలో కండ్రిగ ప్రాంతానికి చెందిన రామారావును ఆగంతకులు పట్టపగలే బైక్‌లపై వచ్చి కత్తులతో నరికి చంపారు. దీంతో స్ధానికంగా ప్రజలు భయభ్రాంతులయ్యారు. మృతుడి వివరాల ఆధారంగా హంతకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ కూడా పరిశీలించిన పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో అసలు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.

మే నెల 16వ తేదీన ఒక ప్రేమ పంచాయితీ జరిగింది. మైనర్ బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. అమ్మాయి బాబాయి మురళి పంచాయితీ చేశారు. ఈ విషయానికి సంబంధించి కొరుకూరి రవీంద్రను రెండు సార్లు కండ్రిగ ప్రాంతానికి చెందిన రామారావుకు ఫోన్ చేసి బెదిరించాడు. రామారావు తనను ఎక్కడ చంపేస్తాడని భయంతో విజయవాడకు చెందిన పాత నేరస్తులను ఆశ్రయించాడు. దీంతో పక్కాగ ఫ్లాన్ చేసుకున్న దుండుగులు రామారావును దుర్గా ఆగ్రహారం నడిరోడ్డుపై కత్తులతో అత్యంత దారుణంగా నరికి హత్య చేశారు. ఈకేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డ కోతల‌‌ శివ, కొరుకూరి రవీంద్ర, అశోక్ కుమార్, కరీం, మురళి, వినయ్ కుమార్, నిహాంత్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. అరెస్ట్ అయినవారందరిపైనా రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నామని డీసీపీ పేర్కొన్నారు.

Read Also….  ఢిల్లీ నుంచి రూ.800లతో రిషికేశ్ టూర్ రెండు రోజులు ఎంజాయ్ చేయొచ్చు.. ఎలాగంటే..