అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. స్పేస్ ఫ్లేస్ సంపాదించిన గుంటూరు యువతి
Indian Woman fly into space: అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్ సంస్థ సిద్దం చేసిన‘ వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ’ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా భారత సంతతికి చెందిన శిరీష బండ్ల...
Indian Origin Woman fly into space: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్ సంస్థ సిద్దం చేసిన‘ వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ’ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కల్పనా చావ్లా, ఇండియన్ అమెరికన్ సునీతా విలయమ్స్ తరువాత అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ సంతతి మహిళల సరసన చేరారు. అలాగే, ఈ ఘనత సాధించిన తొలి తెలుగు తేజం. రెండవ భారతీయ మహిళ, నాల్గవ భారతీయురాలు కూడా చరిత్ర సృష్టించబోతున్నారు.
అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఈ వ్యోమనౌకను నింగిలోకి పంపించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్‌తోపాటు ఐదుగురు వ్యక్తులు ప్రయాణించనున్నారు. వీరిలో సంస్థ ఉపాధ్యక్షురాలు, తెలుగు యువతి శిరీష కూడా చోటు దక్కించుకోవడం విశేషం. రిచర్డ్ బ్రాన్సన్‌తో కలిసి హాబ్‌నాబ్ చేయటం.. గర్వించదగ్గ విషయమంటూ శిరీష బంధువు రామారావు కన్నెగంటి సంతోషం వ్యక్తం చేశారు. ‘వర్జిన్ గెలాక్టిక్’ వ్యోమనౌకలో బ్రాన్సన్‌తో కలిసి ఆరుగురితో యూనిటీ 22 టెస్ట్ ఫ్లైట్ జూలై 11, గురువారం సాయంత్రం న్యూ మెక్సికో నుండి బయలుదేరుతుందని కంపెనీ ప్రకటించింది.
అంతరిక్ష ప్రయాణాల కోసం గత వారంలో వర్జిన్ గెలాక్టిక్ అమెరికాకు చెందిన ది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు సాధించిన సంగతి తెలిసిందే. ఈ రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఇప్పటికే దాదాపు 600మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారట. మరోవైపు, అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఈ నెల 20న అంతరిక్ష పర్యటనకు పోటీగా ఆయన కంటే ముందుగానే వర్జిన్ గెలాక్టిక్ రంగంలోకి దిగుతుండటం గమనార్హం.
ఇదిలావుంటే, భారత సంతతికి చెందిన శిరీషా.. పర్డ్యూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జార్జ్‌టౌన్ యూనివర్సిటి నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టా పొందారు. 2015లో వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా బండ్ల శిరీష చేరారు. అప్పటినుండి వర్జిన్ ఆర్బిట్ కోసం వాషింగ్టన్ కార్యకలాపాలను నిర్వహిస్తూ అనేక ఉన్నత ర్యాంకులను సొంతం చేసుకున్నారు. తాజాగా జూలై 11న బయలుదేరనున్న ‘వర్జిన్ గెలాక్టిక్’ వ్యోమనౌకలో చోటు సంపాదించుకున్నారు. చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్‌స్ట్రక్టర్ బెత్ మోసెస్, లీడ్ ఆపరేషన్స్ ఇంజనీర్ కాలిన్ బెన్నెట్ అంతరిక్షంలోకి పయనించనున్నారు.
Join us July 11th for our first fully crewed rocket powered test flight, and the beginning of a new space age. The countdown begins. #Unity22 https://t.co/5UalYT7Hjb. @RichardBranson pic.twitter.com/ZL9xbCeWQX
— Virgin Galactic (@virgingalactic) July 1, 2021