Drones: విపత్తుల సమయంలో మనుషులను రక్షించేందుకు సహకరించే డ్రోన్..ఇది శబ్దాల్లో తేడాలను గుర్తిస్తుంది!
Drones: జర్మనీ శాస్త్రవేత్తలు ఒక డ్రోన్‌ను రూపొందించారు. ఇది ప్రకృతి విపత్తులో చిక్కుకున్న ప్రజలను వారి ఏడుపులను వినడం ద్వారా రక్షించగలదు.
Drones: జర్మనీ శాస్త్రవేత్తలు ఒక డ్రోన్‌ను రూపొందించారు. ఇది ప్రకృతి విపత్తులో చిక్కుకున్న ప్రజలను వారి ఏడుపులను వినడం ద్వారా రక్షించగలదు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఈ డ్రోన్ మానవులు, జంతువులు, పక్షుల రెక్కల శబ్దం మధ్య తేడాలను గుర్తించగలదు. ఈ డ్రోన్ పరీక్షల సమయంలో మనుషుల అరుపులు, చప్పట్లు కొట్టడం.. ఇతర శబ్దాలు వంటి అన్నిటినీ గుర్తించగలిగింది. దీనిని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ డ్రోన్ ల సహాయంతో భవిష్యత్ లో పలు రకాల సహాయ కార్యక్రమాలను చేపట్టడానికి అవకాశం ఉంది.
బాధితులను కూడా పసిగట్టవచ్చు.. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం, విపత్తులో చిక్కుకున్న ప్రజల వాసనను గుర్తించే విధంగా డ్రోన్ ను రూపొందించారు. బ్లడ్హౌండ్ జాతి కుక్కలు వాసన వాసన ద్వారా మానవులను గుర్తిస్తాయి. ఎక్కడైనా ఒక భవనం కూలిపోయింది అనుకోండి. అటువంటి పరిస్థితిలో ఆ శిధిలాల కింద ఎవరైనా మానవులు ఉన్నారా అనే విషయం తెలుసుకోవడానికి ఈ కుక్కలను ఉపయోగిస్తారు. అదే విధంగా ఈ డ్రోన్ లు కూడా ఇలాంటి పని చేయగలవు. అక్కడ కనిపెట్టిన మానవుల సమాచారంతో ఈ డ్రోన్ లు రెస్క్యూ టీంను అప్రమత్తం చేయగలదని దీనిని తయారుచేసిన బృందంలోని సభ్యురాలు వారెలా చెప్పారు.
శాస్త్రవేత్తలు డ్రోన్ల డేటాబేస్లో ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తుల వివిధ రకాల స్వరాలను చేర్చారు. అరవడం, చప్పట్లు కొట్టడం, తన్నడం వంటి శబ్దాలు రికార్డ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో, డ్రోన్ అటువంటి శబ్దాలకు స్పందించేలా శిక్షణ ఇచ్చారు. శాస్త్రవేత్తలు పక్షి రెక్కల శబ్దం..గాలి చప్పుడు..గాలి మోటారు శబ్దాన్ని దాని డేటాబేస్లో చేర్చారు. తద్వారా ఇది విపత్తు సమయంలో మానవులకు, అలాంటి శబ్దాలకు మధ్య గందరగోళానికి గురి అవడం లేదా తప్పు సమాచారాన్ని ఇవ్వడం చేయదు.
ఇది చాలా చిన్న డిజిటల్ మైక్రోఫోన్‌ను కలిగి ఉంటుంది. ఇది ధ్వనిని వినగలదు. ఈ డ్రోన్ క్షేత్ర పరీక్షలలో విజయవంతమైంది. పరీక్ష సమయంలో, కొన్ని సెకన్లలో, ఇది పరిశోధకుడి అరుపు శబ్దాన్ని గుర్తించి అక్కడే ఆగిపోయింది. సహాయ బృందానికి సహాయం చేస్తుంది
భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలలో, ప్రాణాలను కాపాడటానికి ప్రతి సెకను ముఖ్యం, అటువంటి పరిస్థితిలో కొత్త డ్రోన్ చాలా సహాయకారిగా ఉంటుంది. డ్రోన్ తక్కువ సమయంలో సులభంగా పెద్ద ప్రాంతానికి చేరుకోగలదు. విపత్తు నుండి ప్రజలను రక్షించే బృందానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
Also Read: Radio: ప్రపంచ సమాచార వ్యవస్థ గతినే మార్చిన రేడియో.. ఈ ఆవిష్కరణ కోసం మార్కోనీ ఏం చేశాడో తెలుసా?