- Telugu News Photo Gallery Science photos Rocket launch in the air the virgin orbit of california successfully launched racket from air
Rocket Launch: విమానం ద్వారా విజయవంతంగా అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగం సక్సెస్..నిర్ణీత కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాలు
Rocket Launch : ఆకాశం నుంచి అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగం ఎపుడైనా విన్నారా? విమానంలో రాకెట్ తీసుకువెళ్ళి ఆకాశం నుంచి దానిని లాంచ్ చేశారు కాలిఫోర్నియాలో.
Updated on: Jul 02, 2021 | 2:57 PM

ఇంతవరకూ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించడానికి ప్రయోగించే రాకెట్లు భూమి మీద నుంచి పంపించడం మనకు తెలుసు. కానీ, విమానంలో ఆకాశంలోకి వెళ్లి అక్కడ రాకెట్ లాంచ్ చేయడం ఎప్పుడూ తెలీదు. మొదటిసారిగా ఈ విధంగా రాకెట్ ను విమానం ద్వారా అంతరిక్షంలోకి దూసుకుపోయేలా చేశారు. ఈ అద్భుతాన్ని కాలిఫోర్నియాలోని మోజావే ఎడారి నుంచి బయలుదేరిన వర్జిన్ విమానం చేసింది.

వర్జిన్ 747 జెట్ కాస్మిక్ గర్ల్ జెట్ గగనతలంలోకి దాని ఎడమ రెక్క కిందుగా 70 అడుగుల (21 మీటర్లు) రాకెట్‌ను మోసుకువేల్లింది. అక్కడ మోజావే ఎడారి దీవుల దగ్గరలోని పసిఫిక్ సముద్రం మీదుగా ఎగురుతూ లాంచర్ వన్ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపించింది. భూమికి సుమారు 37,000 అడుగుల (11,000 మీటర్లు) ఎత్తులో ఈ ప్రయోగం జరిగింది.

విమానం నుంచి విడువడిన రాకెట్ ఇంజన్ స్టార్ట్ అయ్యి.. భూమికి వ్యతిరేకంగా ఏడు చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకుపోయింది. ఈ ఉపగ్రహాలు యు.ఎస్. రక్షణ విభాగం, రాయల్ నెదర్లాండ్స్ వైమానిక దళం, పోలాండ్ కు చెందినా సాట్ రివల్యూషన్ సంస్థల నుండి వచ్చాయి. ఇవి భూమిని పరిశీలించే ఉపగ్రహ సముదాయాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాయి.

వర్జిన్ గెలాక్సీ సంస్థ చేపట్టిన ఈ రాకెట్ లాంచింగ్ తో పాటు.. ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టె కార్యక్రమం కూడా విజయవంతం అయినట్టు వర్జిన్ ఆర్బిట్ సీయీవో డాన్ హార్ట్ ప్రకటించారు. ఉపగ్రహాలు అన్నీ సరైన కక్ష్యలో ఉన్నాయని తెలిపారు.

వర్జిన్ తన మొదటి బ్యాచ్ ఉపగ్రహాలను జనవరిలో కక్ష్యలోకి పంపింది. నాసా-ప్రాయోజిత 10 ఉపగ్రహాలను విశ్వవిద్యాలయాలు రూపొందించాయి. అయితే ఈ ప్రయోగం అప్పట్లో విజయవంతం కాలేదు. ఇప్పుడు ఈ విజయంతో ఆకాశం నుంచి అంతరిక్షంలోకి రాకెట్ ల ద్వారా ఉపగ్రహాలను చేర్చడం సులువు అయిందని వర్జిన్ సంస్థ చెబుతోంది. భూమి నుండి రాకెట్లను ప్రయోగించే సాంప్రదాయక మార్గంతో పోల్చితే, దాని వాయు-ప్రయోగ వ్యవస్థ ఉపగ్రహాలను తక్కువ నోటీసులో కక్ష్యలో ఉంచగలదని వర్జిన్ ఆర్బిట్ తెలిపింది.



