Bengaluru Loud Sounds: బెంగళూరులో భారీ వింత శబ్దాలు.. ఊగిపోతున్న కిటికీలు.. ఉలిక్కిపడ్డ నగరవాసులు.. సోషల్‌ మీడియాలో వైరల్‌..!?

కర్ణాటకలో వింత శబ్దాల కలకలం. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ శబ్ధాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ప్రజలు.

Bengaluru Loud Sounds: బెంగళూరులో భారీ వింత శబ్దాలు.. ఊగిపోతున్న కిటికీలు.. ఉలిక్కిపడ్డ నగరవాసులు.. సోషల్‌ మీడియాలో వైరల్‌..!?
Bengaluru City
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 02, 2021 | 4:08 PM

Bengaluru Loud Sounds: కర్ణాటకలో వింత శబ్దాల కలకలం. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ శబ్ధాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ప్రజలు. ముఖ్యంగా బెంగళూరు నగరంలో ఈ వింత శబ్ధాల ధాటికి ఇళ్ల, తలుపులు, కిటికీలు కొట్టుకున్నాయి. దీంతో భూకంపం వచ్చిందేమోనని స్థానికులు ఉలిక్కిపడ్డారు. కానీ బయటకొచ్చి చూస్తే అంతా బాగానే ఉంది. ఆ శబ్దాలు ఎలా వచ్చాయో అర్థం కాలేదు. దీంతో ఈ వింత శబ్ధాలపై ఆరా తీస్తున్నారు అధికారులు.

కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ శబ్దం వినిపించింది. దీంతో బెంగళూరు నగర వాసులు ఉలిక్కిపడ్డారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వినిపించిన ఈ భారీ శబ్దం ధాటికి పలు నివాసాల్లో అద్దాలు ధ్వంసమయ్యాయి. హెచ్‌ఎస్ఆర్ లే అవుట్, మహదేవపుర, సిల్క్‌బోర్డ్, మడివాల, బొమ్మనహళ్లి, కొత్తనూరు, అగర, హుళిమావు, అనేకల్, పద్మానభ నగర్ వంటి పలు ప్రాంతాల్లో ఈ శబ్దం వినిపించింది. ఈ శబ్దానికి గల కారణాలపై బెంగళూరు పోలీసుల ఆరాతీస్తున్నారు.

అర్జాపూర్‌, జేపీనగర్‌, బెన్సన్‌టౌన్‌, ఉల్సూర్‌, ఇస్రో లేఔట్‌..హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌, ఈస్ట్, సౌత్‌ బెంగళూరులో ఈ వింత శబ్ధాలొస్తున్నాయంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గతేడాది మేలోనూ భారీ శబ్దాలు బెంగళూరు వాసులను భయపెట్టాయి. ఐతే అవి సుఖోయ్‌ యుద్ధ విమానం టేకాఫ్ అవుతుండగా భారీ శబ్దాలు వచ్చినట్లు హెచ్ఏఎల్ వెల్లడించింది. దీంతో ఇది కూడా అలాంటిదేనా అని ఆరా తీస్తున్నారు. ఐతే ఈ మిస్టీరియస్‌ సౌండ్స్‌పై ఇప్పుడే ఏం చెప్పలేమంటోంది.

Read Also…  Minister KTR: నూతన జోనల్ వ్యవస్థతో ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే.. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తే, ప్రత్యేక ప్రోత్సాహకాలుః మంత్రి కేటీఆర్