Union Minister on farm laws: కొత్త సాగు చట్టాలపై కేంద్ర మంత్రి తోమర్ కీలక వ్యాఖ్యలు.. శరద్ పవార్ సూచనలు పరిగణంలోకి తీసుకుంటామని స్పష్టం

కొత్త సాగు చట్టాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు చేసే సూచనలు పరిగణంలోకి తీసుకుంటామన్నారు.

Union Minister on farm laws: కొత్త సాగు చట్టాలపై కేంద్ర మంత్రి తోమర్ కీలక వ్యాఖ్యలు.. శరద్ పవార్ సూచనలు పరిగణంలోకి తీసుకుంటామని స్పష్టం
Union Minister Narendra Singh Tomar On Sharad Pawar
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 02, 2021 | 3:29 PM

Union Minister Narendra Singh Tomar on Sharad Pawar comments: కొత్త సాగు చట్టాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు చేసే సూచనలు పరిగణంలోకి తీసుకుంటామన్నారు. ఇటీవల కొత్త సాగు చట్టాలపై ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు మంత్రి తోమర్ చెప్పారు. ఈ చట్టాలను పూర్తిగా తిరస్కరించరాదని, కేవలం సమస్యాత్మక భాగాలను మాత్రమే సవరించవచ్చునని పవార్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా ఇదేనని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ ఆలోచనా విధానంతోనే ప్రభుత్వం రైతులతో చర్చిస్తోందని శుక్రవారం తోమర్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు.

ఎన్‌సీపీ చీఫ్, కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి శరద్ పవార్ గురువారం ముంబైలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాల్లో కొన్ని సవరణలు చేయవలసిన అవసరం ఉందన్నారు. వాటిని పూర్తిగా తిరస్కరించాల్సిన అవసరం లేదన్నారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయడానికి బదులు రైతులకు సమస్యలు సృష్టిస్తున్న వివాదాస్పద అంశాలను సవరించవచ్చునని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ చట్టాలపై ఓ నిర్ణయానికి రావడానికి ముందు వాటిపై వివరంగా అధ్యయనం చేయాల్సిన అవసరముందన్నారు.

ఇదిలావుంటే, శరద్ పవార్ వ్యాఖ్యలపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాల్లో సవరణలకు తాము అంగీకరించబోమని తెలిపారు. సాగు చట్టాలను ఎత్తివేసేవరకు ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు.  మరోవైపు, కొత్త సాగు చట్టాల రద్దు కోసం అన్నదాతల ఆందోళన ఏడాదికి పైగా కొనసాగుతూనే ఉంది.

Read Also… Osmania Hospital: అరుదైన ఘనత సాధించిన ఉస్మానియా ఆసుపత్రి.. మూడు ప్రపంచ రికార్డుల్లో చోటు…