Darbhanga blast case: మీరు కూడా టెర్రర్ కుట్రలో ఇరుక్కోవచ్చు.. జర భద్రం..! దర్భాంగ కేసులో చిక్కుకున్న ఓ సామాన్యుడు..
Darbhanga blast parcel: అవును ఇది నిజం.. ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నా.. మీ నెంబర్ అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. దర్భాంగ బ్లాస్ట్ తర్వాత ప్రతీ ఒక్కరినీ వణికించే విషయం ఇది. మన డాక్యుమెంట్స్, మన ఫోన్ నెంబర్స్..
మీకు ఓ ఫోన్ నెంబర్ ఉంది. మీకు ఓ అడ్రెస్ ఉంది. మీకూ ఓ ఆధార్ కార్డుంది. అయితే మీరూ ఉగ్ర ఉచ్చులో ఇరుక్కోవచ్చు. మీకూ ఉగ్రవాదులకు సంబంధం ఏంటని విచారణ ఎదుర్కోవచ్చు. అవును ఇది నిజం.. ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నా.. మీ నెంబర్ అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. దర్భాంగ బ్లాస్ట్ తర్వాత ప్రతీ ఒక్కరినీ వణికించే విషయం ఇది. మన డాక్యుమెంట్స్, మన ఫోన్ నెంబర్స్.. ఇవన్నీ మన సోషల్ సెక్యూరిటీగా ఫీలవుతుంటాం. కానీ ఇవన్నీ బహిరంగ రహస్యాలు, తెరిచిన పుస్తకాలు. దాన్నే మరోసారి నిరూపించింది దర్భాంగ పేలుడు ఘటన. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి కారణమైన దర్భాంగ బ్లాస్ట్‌లో హైదరాబాద్ లింక్స్ బయటపడ్డాయి.మాలిక్ బ్రదర్స్ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు.
పాపం ఈ ఘటనకు సంబంధం లేని మరో వ్యక్తి ఇందులో ఇరుక్కు పోయాడు. ఇతనుండేది ఉత్తరాఖండ్‌లో ఇప్పుడూ ఈయన కూడా ఆ బ్లాస్ట్‌కి, టెర్రరిజానికీ లింక్స్ ఉన్నాయా అనే ప్రశ్నను NIA నుంచి ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి ఇతడకి… మాలిక్ బ్రదర్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ ఉచ్చు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. కారణం.. మాలిక్ బ్రదర్స్ పంపిన పార్శిల్‌పై ఈయన ఫోన్ నెంబర్ ఉండడమే.. !
మాలిక్ బ్రదర్స్ చేసిన పార్శిల్‌కు సంబంధించిన రిసిప్ట్. ఇందులో ఫ్రమ్ సూఫియాన్, టు సూఫియాన్..అంటూ పేరు రాసి ఉంది. ఇంతకీ సూఫియాన్ ఎవరంటే.. ఓ ఏజెంట్. ఆ ఏజెంట్ నెంబర్ 8477812850 ఇది. ఇంత ఆధారం ఉంటే పోలీసులు వెంటపడకుండా ఎలా ఉంటారు? అందుకే గాలించారు. సీన్ కట్ చేస్తే ఆ పేలుడు సంబంధం లేని వ్యక్తి చిక్కుకున్నాడు. కానీ తేలింది ఏంటంటే.. అసలు ఈ మొత్తం కథకీ, ఈ వ్యక్తికీ సంబంధం లేదని. అంటే పక్కా ఫేక్ డీటేల్స్‌తో పార్శిల్ పంపారని NIA అధికారులు నిర్ధారణకు వచ్చారు.
వహ్వా.. వాట్ ఏ స్కెచ్… జనం చచ్చిపోవాలి… బ్లాస్ట్ జరిగితే టెర్రరిజం అంటారు కాబట్టి.. ప్రమాదం సృష్టించాలన్నది ఓ మాస్టర్ మైండ్. ఆ తర్వాత పోలీసులు ఆరా తీసినా ఏమీ తెలియకుండా ఉండడానికి.. తెలియని వ్యక్తి పేర్లు పెట్టాలి.. ఇది బ్లాస్టింగ్ మైండ్ ప్లాన్. అడ్డగోలుగా ఎవరిదో ఫోన్ నెంబర్ ఇచ్చేశారు. ఇంకేదో అడ్రస్ రాసేశారు. పార్శిల్ వెళ్లింది.. దర్భాంగ స్టేషన్‌లో పేలింది.
పోలీసులకు, సైన్యానికి దీటుగా టెక్నాలజీని వాడుతున్న ఉగ్రవాదులు.. ఇలా ఫేక్ అడ్రస్‌లతో అమాయకులను కూడా పేలుడు ఉచ్చులో ఇరికిస్తున్నారు. అది ఎలా అని అనుకునే సామన్యులకు.. ఈ పేలుడు కుట్రే ఉదాహరణగా నిలుస్తుంది. మళ్లీ గుర్తు చేస్తున్నాం.. ఉగ్రవాదులు ఇచ్చిన ఫేక్ డీటేల్స్ ఉచ్చులో ఇరుక్కున్న వ్యక్తి ఇప్పుడు ఇబ్బుందులు పడుతున్నాడు. మీరు కూడా జాగ్రత్త.. ఎవరికైనా నెంబర్ ఇస్తున్నప్పుడు.. సోషల్ మీడియాలో మీ నెంబర్ పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. జాగ్రత్తగా లేకపోతే.. మన పరిస్థితి కూడా ఇంతే కావచ్చని హెచ్చరించే ప్రయత్నం ఇది.