AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Osmania Hospital: అరుదైన ఘనత సాధించిన ఉస్మానియా ఆసుపత్రి.. మూడు ప్రపంచ రికార్డుల్లో చోటు…

ఉస్మానియా ఆసుపత్రి అరుదైన ఘనత సాధించింది... వందేళ్ళ చరిత్ర కలిగిన ఉస్మానియా దవాఖాన మూడు ప్రపంచ స్థాయి రికార్డులను తన పేరున రాసుకుంది.

Osmania Hospital: అరుదైన ఘనత సాధించిన ఉస్మానియా ఆసుపత్రి.. మూడు ప్రపంచ రికార్డుల్లో చోటు...
Osmania Hospital
Rajitha Chanti
|

Updated on: Jul 02, 2021 | 3:21 PM

Share

ఉస్మానియా ఆసుపత్రి అరుదైన ఘనత సాధించింది… వందేళ్ళ చరిత్ర కలిగిన ఉస్మానియా దవాఖాన మూడు ప్రపంచ స్థాయి రికార్డులను తన పేరున రాసుకుంది. ఉస్మానియా ఆసుపత్రి వందలాది మంది వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించి ఉస్మానియా కీర్తి, ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పింది.. అంతేకాకుండా.. వేలాది మంది రోగుల ప్రాణాలను కాపాడి వారి కుటుంబ సభ్యులకు అంతులేని ఆనందాన్ని కానుకగా అందించారు వైద్యులు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ రికార్డుల భారత ప్రతినిధి లయన్ కె.వి. రమణారావు.. దక్షిణ భారత ప్రతినిధి శ్రీవిద్య, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి రాజు పాల్గోని.. వరల్డ్స్‌ రికార్డ్, భారత్‌ వరల్డ్స్‌ రికార్డ్స్‌, డాక్టర్స్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రశంస పత్రాలను ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నాగేందర్ కు అందజేశారు.

ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ.. “ప్రపంచానికి అనస్తీషియా ను పరిచయం చేసిన ఘనత కూడా ఉస్మానియా దవాఖానకే దక్కుతుందన్నారు. కొవిడ్‌ విపత్కర పరిస్థితిలో గాంధీ, కింగ్‌ కోఠిలను కొవిడ్‌ కేంద్రాలుగా మార్చడంతో ఆయా దవాఖానాలకు వెళ్ళే సాధారణ రోగులంతా ఉస్మానియాకే రావడంతో వారికి మెరుగైన వైద్య సేవలందించడంలో విశేషంగా కృషి చేసి ప్రాణాలను నిలబెట్టారని కొనియాడారు. కిడ్నీ, లివర్‌, అవయవ మార్పిడి విజయవంతంగా నిర్వహించడంతో పాటు 700లకు పైగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లను నిర్వహించి రెండు తెలుగు రాష్ర్టాలలో ఆసుపత్రినీ అగ్రస్థానంలో నిలిచిందని….అంతే కాకుండా త్వరలోనే హార్ట్‌, లంగ్స్‌ అవయవ మార్పిడిలను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారని తెలిపారు..

Also Read: Rocket Launch: విమానం ద్వారా విజయవంతంగా అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగం సక్సెస్..నిర్ణీత కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాలు

Samantha Akkineni: ‘నా జీవితంలో మూడు మార్పులు జరిగాయి… ఇప్పుడు నాపై నాకు నమ్మకం కుదిరింది’.. ఆసక్తికర విషయాలను చెప్పిన సమంత..

Siddipet: 3 రోజుల క్రితం పాడుబడిన వ్యవసాయ బావిలో పడిన వృద్దుడు.. అరుపులు వినపడడంతో

Hungama 2 : యంగ్ క‌పుల్‌, సీనియ‌ర్ క‌పుల్ జీవితాల్లో నెలకొన్న గందరగోళం.. ఆకట్టుకుంటున్న ట్రైలర్