Samantha Akkineni: ‘నా జీవితంలో మూడు మార్పులు జరిగాయి… ఇప్పుడు నాపై నాకు నమ్మకం కుదిరింది’.. ఆసక్తికర విషయాలను చెప్పిన సమంత..

Samantha Akkineni: చిన్న వయసులోనే మోడల్‏గా కెరీర్ ఆరంభించి.. ఏమాయ చేసావే అన్నట్లుగానే.. తెలుగు ప్రేక్షకులను పూర్తిగా మాయ చేసేసింది సమంత అక్కినేని..

Samantha Akkineni: 'నా జీవితంలో మూడు మార్పులు జరిగాయి... ఇప్పుడు నాపై నాకు నమ్మకం కుదిరింది'..  ఆసక్తికర విషయాలను చెప్పిన సమంత..
Samantha Akkineni
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 02, 2021 | 2:50 PM

Samantha Akkineni: చిన్న వయసులోనే మోడల్‏గా కెరీర్ ఆరంభించి.. ఏమాయ చేసావే అన్నట్లుగానే.. తెలుగు ప్రేక్షకులను పూర్తిగా మాయ చేసేసింది సమంత అక్కినేని.. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి.. టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. తన నటన…  స్మైల్ తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఇటు వెండితెరపైనే కాకుండా.. సమంత డిజిటల్ ఫ్లాట్‍ఫామ్‏లో కూడా తన హావా కొనసాగిస్తుంది. ఇటీవల విడుదలైన “ఫ్యామిలీ మ్యాన్ 2″ వెబ్ సిరీస్‏లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సూపర్ హిట్ సిరీస్‏ తర్వాత డిజిటల్ వేదికపై కూడా ఆఫర్లు క్యూ కట్టాయి. ఇదిలా ఉంటే… తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన వ్యక్తిగత విషయాలతోపాటు… కెరీర్‏కు సంబంధంచిన విషయాలను కూడా వెల్లడించింది. తన కెరీర్ ప్రారంభించి.. 11 సంవత్సరాలు గడుస్తున్నా.. అప్పటి నుంచి ఇప్పటివరకు తనలో వచ్చిన మూడు మార్పుల గురించి చెప్పుకోచ్చింది సామ్.

సమంత మాట్లాడుతూ.. ” కెరీర్ పరంగా నేను చాలా కష్టపడి పనిచేసే వ్యక్తిని… కానీ అదే సమయంలో కాస్త అభద్రతా భావం ఉండేది నాలో.. అంతేకాకుండా.. అనేక స్వీయ సందేహాలు కూడా ఉండేవి.. అయితే కెరీర్ ప్రారంభించి సంవత్సరాలు గడస్తున్న కొద్ది వాటిని అధిగమించడం నేర్చుకుంటూ.. అదే క్రమంలోనే నా అభద్రతాభావాలను తగ్గించుకోవడమే కాకుండా.. అనేక సార్లు రిస్క్‏లు కూడా తీసుకున్నాను” అంటూ చెప్పుకోచ్చింది ఈ చెన్నై బ్యూటీ. ప్రస్తుతం తనపై తనకు నమ్మకంగా ఉందని… ముందున్న భయాలు, అభద్రతాభావాలు పక్కన పెట్టేసి, పెద్ద రిస్క్‏లైన తీసుకోవడం వంటి మూడు ప్రధాన మార్పులు తనలో వచ్చాయని సామ్ చెప్పుకోచ్చింది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. అంతేకాకుండా.. ఇటీవల జ్యూవెల్లరీ వ్యాపారాన్ని కూడా సామ్ ప్రారంభించింది.

Also Read: Rajamouli Twitter: ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌పై అసహనం వ్యక్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి.. స్పందించిన యాజమాన్యం.

Major Movie: అంచనాలు పెంచుతున్న అడివి శేష్ సినిమా.. భారీ ధరకు మేజర్ మూవీ హిందీ శాటిలైట్ రైట్స్..