Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SVR Birthday: నటసింహ ఎస్వీ రంగారావు 103 వ జయంతి నేడు.. ఆయన నటనకు చార్లీ చాప్లిన్ సహా ఎందరో విదేశీయులు ఫిదా

SVR Rare Photo: కను బొమ్మలతోనే నవరసాలు పండించగల గొప్ప నటుడు... చార్లీ చాప్లిన్ వంటి గొప్ప నటుడితోనే ప్రసంసలు అందుకొన్న మహోన్నత వ్యక్తి .. నట యశస్వి.. సుప్రసిద్ధ తెలుగు నటుడు..

SVR  Birthday: నటసింహ ఎస్వీ రంగారావు 103 వ జయంతి నేడు.. ఆయన నటనకు చార్లీ చాప్లిన్ సహా ఎందరో విదేశీయులు ఫిదా
Svr Rare Pic
Follow us
Surya Kala

|

Updated on: Jul 03, 2021 | 2:10 PM

SVR Rare Photo: కను బొమ్మలతోనే నవరసాలు పండించగల గొప్ప నటుడు… చార్లీ చాప్లిన్ వంటి గొప్ప నటుడితోనే ప్రసంసలు అందుకొన్న మహోన్నత వ్యక్తి .. నట యశస్వి.. సుప్రసిద్ధ తెలుగు నటుడు సామర్ల వెంకట రంగారావు (ఎస్వీ రంగా రావు)… ఎస్వీ ఆర్. అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా ఖ్యాతి గడించారు. ఎస్వీఆర్ బంధువైన బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యారు. తన తొలి సినిమాలో రూ.750 పారితోషికంగా అందుకున్నారు. వరూధిని అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో అవకాశాలు మళ్ళీ రాలేదు.. మళ్ళీ ఉద్యోగం చేసుకుంటున్న ఎస్వీరంగారావు కి పెళ్లి అయిన తర్వాత ‘పల్లెటూరిపిల్ల’ అనే చిత్రంలో విలన్ గా నటించే అవకాశం వచ్చింది అయితే అదే సమయంలో ఆయన తండ్రి స్వర్గస్తులైనారు..దీంతో ఆ సినిమాలో అవకాశం చేజారి పోయింది.

విజయా వారి, కెవి రెడ్డి దృష్టిలో పడిన ఎస్వీఆర్ పాతాళ భైరవిలో నేపాలీ మాంత్రికుడి వేషం వేసే ఛాన్స్ అందుకున్నారు. వచ్చిన ఆ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే కాకుండా, ఆయన ఆ పాత్ర పోషించిన తీరు పండిత పామరుల ప్రశంసలు అందుకుంది. విజయవారు మాయాబజార్ తీసేటప్పుడు, ‘ఘటోత్కచుని’ వేషానికి ముందుగా వీరిని తీసుకున్నారు. కె\వి.రెడ్డి గారు అన్నారుట ‘ఆ వేషానికి వేరే ఆప్షన్ లేదు’ అని. అలా ఎస్వీఆర్ నటయాత్ర తెలుగు, తమిళరంగాలలో కొనసాగింది.

నర్తనశాల లోని కీచకుని వేషానికి పలువురి ప్రశంసలు లభించింది. సతీ సావిత్రి అనే సినిమా తీసేటప్పుడు ఎస్వీఆర్ సెట్ లో వున్నారు. మద్రాస్ కు వచ్చిన అలనాటి చైనా ప్రధాన మంత్రి చౌ యెన్ లై స్టూడియో కు వచ్చారు. యముని వేషంలో చూసి ఆశ్చర్య చకితులయ్యారట. యమధర్మరాజు ఆహార్యం లో వున్నా ఎస్వీఆర్ ను చూసి ఆకర్షితుడై , సెట్ లోకి వచ్చి, కరచాలనం చేసి, అభినందిస్తున్న సమయంలో తీసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహానటుడిని మళ్ళీ ప్రేక్షకులకు అలనాటి సిని అభిమానులకు ఆయన్ని గుర్తు చేస్తోంది.

జకార్తాలో జరిగిన ఇండోనేసియా ఫిలిం ఫెస్టివల్ లో, వీరి కీచకుని వేషానికి ఉత్తమ నటుని అవార్డుతో పాటుగా బంగారు పతకం కూడా దక్కింది. ఎంత మహా నటుడినైనా డామినేట్ చేయ గల సత్తా సామర్ధ్యం వీరి సొంతం. వీరితో నటించాలంటే ఆనాటి అగ్రనటులు సైతం భయపడేవారు, ఒక్క సావిత్రి తప్ప.. ఎస్వీఆర్ సమకాలీనుడైన గుమ్మడి గారి మాటల్లో చెప్పాలంటే, ఇటువంటి నటుడు పొరపాటున మన దేశంలో పుట్టాడు, మరే దేశంలోనైనా పుట్టివుంటే ప్రపంచపు నటులలోనే మేటి నటుడయ్యే వాడు.. బంగారు పాప సినిమాలో ఎస్‌.వి.రంగారావు గారి నటనను, లండన్‌లో చూసిన చార్లీ చాప్లిన్‌,  ఎస్వీ రంగారావు నటనకు ఫిదా అయ్యారు. కానీ ఇప్పటి వరకూ ఏ పద్మ లు అందుకోని మేటి నటుడు ఎస్వీఆర్.

Also Read: SV. Rangarao Rare Photos: ఇంత వరకూ ప్రభుత్వం నుంచి ఏ పద్మలు అందుకోని విశ్వనటచక్రవర్తి ఎస్వీ రంగారావు జయంతి నేడు

Also Read: ఏడు రోజులు ఏడు ప్రదక్షిణలు చేసి.. హారతి ఇస్తే.. పక్షవాతం తగ్గించే మహిమాన్విత దేవాలయం ఎక్కడో తెలుసా