- Telugu News Photo Gallery Spiritual photos Chatur das ji temple in butati dham one of the best for paralysis patient nagaur rajasthan
Chatur Das Ji Temple: ఏడు రోజులు ఏడు ప్రదక్షిణలు చేసి.. హారతి ఇస్తే.. పక్షవాతం తగ్గించే మహిమాన్విత దేవాలయం ఎక్కడో తెలుసా
Chatur Das Ji Temple: వైద్యో నారాయణో హరిః అన్నారు పెద్దలు.. అంటే డాక్టర్ దేవుడితో సమానం.. అని అర్ధం.. అవును దేవుడు కూడా వైద్యుడే... ఒక్కొక్క సారి డాక్టర్ కంటే పెద్ద వైద్యుడు దేవుడు.. అందుకనే డాక్టర్ కూడా నయం చేయలేని జబ్బులని నయం చేయమని.. దేవుడిని వేడుకొంటామ్.. అత్యంత భక్తి శ్రద్దలతో దేవుడికి పూజిస్తాం.. ఇదంతా ఎందుకంటే.. డాక్టర్లు కూడా నయం చేయలేని.. పక్షవాతం ను తగ్గించే మహిమాన్విత దేవాలయం గురించి తెలుసుకొందాం..!!
Updated on: Jun 24, 2021 | 9:32 PM

రాజస్థాన్ లోని నాగూర్ జిల్లాలో చతూర్ దాస్ జీ టెంపుల్ ఉనది. ఈ దేవాలయం నాగూర్ జిల్లాలోని దేగాన అనే మండలం లో బుడాటి అనే ప్రదేశంలో ఉన్న ఈ ఆలయం సుమారు 200 ఏళ్ల క్రితం ది అని సమాచారం. ఈ ఆలయానికి నిత్యం 200 నుంచి 250 మంది వరకూ పక్షవాతం సోకిన భక్తులు వస్తుంటారు. తమ వ్యాధిని నయం చేసుకోవడానికి పెరాలసిస్ సోకిన రొగులు ఈ ఆలయం వద్ద 7 రోజులపాటు ఉంటారు. ఈ గుడిలోని దేవుడికి రోజూ హారతి ఇస్తారు.. ఆ హారతి ఇచ్చే సమయంలో ఖచ్చితంగా పక్షవాతం సోకిన రోగులు పాల్గొనాల్సిందే.. అలా ఏడు రోజుల పాటు హారతి ఇస్తే... ఆ వ్యాధి నుంచి రోగులు కోలుకొంటారు.

ఈ మహిమానిత్వమైన దేవాలయానికి 500 ఏళ్ల కు ముందు ఒక సన్యాసి ఈ ప్రదేశానికి వచ్చి.. తపశ్శక్తితో మరియు ధ్యానంతో అక్కడికి వచ్చే రోగుల రోగాలను నయం చేస్తూండేవారు.. ఇప్పటికీ ఆ గుడి వద్ద ఆ సన్యాసి సమాధి ఉన్నది.. ఆ సమాధి చుట్టూ.. 7 రోజుల పాటు 7 ప్రదక్షిణలు చేస్తే.. అనారోగ్యానికి గురైన భక్తులకు నయం అవుతుంది అని ప్రబలనమ్మకం..

అలా ఏడు రోజులు ప్రదక్షిణాలు చేసి అనంతరం మంగళహారతి ఇస్తారు. ఈ హారతి తీసుకొన్న అనంతరం రోగులకు పడిపోయిన కాళ్ళు, చేతులు తిరిగి వస్తాయి.. పక్షవాతంతో మాట పడిపోయిన వారు కూడా కొద్దికొద్దిగా మాట్లాడగలుగుతారు. వ్యాధితో వచ్చే భక్తులు ఇక్కడ ఉండడానికి వసతి సౌకర్యాలు ఉన్నాయి. ఉచిత భోజన, ఉచిత వసతి సౌకర్యాల ఏర్పాట్లు కూడా వున్నాయి.

వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించి వారి పక్షవాత వ్యాధిని నయం చేసుకొంటున్నారు. ఇలా భక్తులు వ్యాధిని నయం చేసుకోవడానికి ఏ విధమైన డబ్బుని ఆశించిరు. కానీ భక్తులే తమ వ్యాధి నయం చేసిన దేవుడికి భక్తితో దేవాలయం అభివృధ్ధికి ధన సహాయం చేస్తారు.. అంతేకానీ ఈ చతుర్ దాస్ జీ మహారాజ మందిరాన్ని దర్శించడానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు..

ఈ దేవాలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ తెరచి ఉంటుంది. పక్షవాత రోగులే కాదు.. వివిధ రోగాలతో బాధపడే వారు కూడా స్వామిని దర్శించుకొని తమ రోగాలను నయం చేసుకొంటున్నారు. ఇది మూఢనమ్మకం కాదు.. అనేక చికిత్సలతో కూడా బాగుచేయలేనటువంటి వివిధ రోగులు ఈ దేవాలయానికి వచ్చి బాగుచేసుకొని వెళ్ళిన అనేక ఉదాహరణలున్నాయి. ఈ గుడికి వెల్లడానికి జైపూర్ నుంచి నేరుగా బస్సులున్నాయి.





























