Batuk Bhairav Mandir: అక్కడ శివుడుకి పిల్లలు బిస్కెట్లు, చాక్లెట్లు సమర్పిస్తే.. పెద్దవారు మద్యం, మాంసం నైవేద్యం..

Batuk Bhairav Mandir: హిందూ ధర్మంలో దేవతలకు దేవుళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. దేవతలను కొలిచే హిందువులు భూత ప్రేత పిచాలు ఉన్నాయని నమ్ముతారు. దేవుళ్ళకు నైవేద్యంగా పులిహోర చెక్కెర పొంగలి అరటి పళ్ళు , కొబ్బరి కాయలు నైవేద్యంగా పెట్టడం మనకు తెలుసు. అయితే ఓ ఆలయంలో మాత్రం మందు, మాంసం బిస్కట్లను నైవేద్యంగా పెడతారు..

Surya Kala

|

Updated on: Jun 25, 2021 | 9:27 PM

అతిపురాతన పవిత్ర క్షేత్రం వారణాసి. ఈ క్షేత్రంలో  శివుడిని కాలభైవరుడిగా కొలుస్తారు. అయితే ఇక్కడ బాబా బాతుక్ భైరవ ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారిని బాబా బాతుక్ భైరవ స్వామిగా భక్తులు కొలుస్తారు. ఇక్కడ స్వామికి కానుకలుగా పెద్దలు మాంసం, లిక్కర్ ఇస్తారు. అదే పిల్లలైతే బిస్కెట్లు, చాక్లెట్లు సమర్పిస్తారు.

1 / 5
ఈ ఆలయంలో మహాదేవుడు... మూడు రూపాల్లో దర్శనమిస్తాడు. సాత్విక రూపం, రజస్వ రూపం, తామస రూపం. ప్రత్యేక పర్వ దినాల్లో స్వామిని మూడు రూపాల్లో అలంకరిస్తారు.

2 / 5
 స్వామికి ఉదయం వేళ చిన్నారి స్వామిగా భావించి చిన్నపిల్లలతో చాక్లెట్లు, బిస్కెట్లు, పండ్లను నైవేద్యంగా ఇప్పిస్తారు. ఇక మధ్యాహ్నం సమయంలో మహాదేవుడి వస్త్రాలను మార్చివేస్తారు.. దీంతో అయన రాయల్ గా కనిపిస్తారు. దీంతో నైవేద్యంగా పప్పు, రైస్, బ్రెడ్, కూరగాయలను సమర్పిస్తారు. రాత్రి సమయంలో మహా హారతి ఇచ్చిన అనంతరం మాంసం కూర, చేపల కూర, ఆమ్లెట్ , మద్యాన్ని నైవేద్యంగా మద్యం సమర్పిస్తారు.

3 / 5
 
మహాదేవుడు రాత్రివేళ ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. ఆ రూపంలో ఉన్న స్వామివారిని బ్రాందీ తో పూజిస్తారు.  అయితే ఈ ఆలయంలోని దీపం నిత్యం వెలుగుతూనే ఉంటుంది.

4 / 5
వారణాశి కి వెళ్లే పర్యాటకులు మహాదేవుడిని దర్శనం చేసుకుని ఉదయం నుంచి రాత్రి వరకూ అక్కడే ఉంటారు. మూడు వేళల్లో స్వామివారికి సమర్పించే కానుకలు చూసి దేవుడిని భక్తితో కొలుస్తారు. ఈ మహాదేవుడు మహా శక్తివంతుడని.. కష్టాలు, కన్నీళ్లను కచ్చితంగా దూరం చేస్తాడని భక్తుల నమ్మకం

5 / 5
Follow us