AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinematograph Act: సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై తీవ్రమవుతోన్న వ్యతిరేకత.. కేంద్రానికి తమ అభ్యంతరాలు తెలియజేసిన..

Cinematograph Act: కేంద్ర ప్రభుత్వం భారతీయ సినీ పరిశ్రమలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించే పనిలో పడింది. ఈ క్రమంలో 1952 నాటి సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరిస్తూ ముసాయిదా బిల్లును రూపొందించింది. ముఖ్యంగా సినిమా..

Cinematograph Act: సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై తీవ్రమవుతోన్న వ్యతిరేకత.. కేంద్రానికి తమ అభ్యంతరాలు తెలియజేసిన..
Cinema News
Narender Vaitla
|

Updated on: Jul 03, 2021 | 2:09 PM

Share

Cinematograph Act: కేంద్ర ప్రభుత్వం భారతీయ సినీ పరిశ్రమలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించే పనిలో పడింది. ఈ క్రమంలో 1952 నాటి సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరిస్తూ ముసాయిదా బిల్లును రూపొందించింది. ముఖ్యంగా సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ విషయంలో మార్పులు చేయదలిచి కేంద్రం పలు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. సవరణల ప్రతిపాదనలపై జులై 2 వరకు అభిప్రాయాలను తెలపాలని కోరుతూ జూన్ 18న ప్రకటన జారీ చేసింది. ఇదిలా ఉంటే కేంద్రం తీసుకురానున్న ఈ చట్ట సవరణపై వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి. సవరణల ముసాయిదాపై పలు సినిమా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే 6 సినిమా సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి తమ అభ్యంతరాలు తెలియజేశాయి.ఈ బిల్లు సినీ పరిశ్రమకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని సినీ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కొత్త బిల్లు భావప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని చెబుతున్నాయి. సీబీఎఫ్‌సీకే అన్ని అధికారాలు ఉండేలా చూడాలని సినీ సంఘాలు కేంద్రానికి సూచించాయి. ఇదిలా ఉంటే ఈ బిల్లు సవరణపై పలువురు హీరోలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తమిళ స్టార్‌ హీరో కమల్‌ స్పందిస్తూ.. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాత కూడా, ఓ సినిమాను సమీక్షించే అధికారం ఈ చట్టం ద్వారా కేంద్రానికి లభిస్తుందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఇక సూర్య కూడా ఈ కొత్త చట్టంపై స్పందించారు. ‘చట్టమంటే భావ ప్రకటన స్వేచ్ఛను కాపడటం. దాని స్వరతంత్రులను గొంతు కోసి చంపడం కాదు’ అంటూ చురకుల అంటించారు. ఇక గౌతమ్ వాసుదేవ మీనన్, కార్తీక్ సుబ్బరాజు వంటి వారు కూడా ఈ చట్టం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు. మరి ఇంత వ్యతిరేకత ఎదురవుతోన్న నేపథ్యంలో కేంద్రం వెనుకడుగు వేస్తుందో లేదో చూడాలి.

Also Read: Dhanush : హైదరాబాద్ లో తమిళ్ స్టార్ హీరో.. ధనుష్ ను కలిసిన శేఖర్ కమ్ముల.. కాసేపు మాట మంతి

Accident: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడి కుమారుడికి గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స

Shahid Kapoor: కొత్తింటిని కొనుగోలు చేసిన షాహిద్‌ కపూర్.. ఈ డూప్లెక్స్‌ ఫ్లాట్‌ ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా