AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush : హైదరాబాద్ లో తమిళ్ స్టార్ హీరో.. ధనుష్ ను కలిసిన శేఖర్ కమ్ముల.. కాసేపు మాట మంతి

టాలీవుడ్ పై సౌత్ హీరోలు మసన్సు పారేసుకుంటున్నారు. తెలుగు సినిమా స్థాయి రోజురోజుకు పెరుగుతుండటంతో ఇతరభాషల హీరోలంతా మన దర్శకులతో సినిమాలు చేయడానికి తహతహలాడుతున్నరు.

Dhanush : హైదరాబాద్ లో తమిళ్ స్టార్ హీరో.. ధనుష్ ను కలిసిన శేఖర్ కమ్ముల.. కాసేపు మాట మంతి
Danush
Rajeev Rayala
|

Updated on: Jul 03, 2021 | 9:24 AM

Share

Dhanush : టాలీవుడ్ పై సౌత్ హీరోలు మసన్సు పారేసుకుంటున్నారు. తెలుగు సినిమా స్థాయి రోజురోజుకు పెరుగుతుండటంతో ఇతరభాషల హీరోలంతా మన దర్శకులతో సినిమాలు చేయడానికి తహతహలాడుతున్నరు. ఇప్పటికే తమిళ్ స్థార్ హీరోలు తెలుగులోకి  డైరెక్ట్ గా అడుగు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. దళపతి విజయ్, సూర్య తాజాగా ధనుష్ ఇలా స్టార్స్ అంతా టాలీవుడ్ వైపు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో ధనుష్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నారన్న వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమా పై ఆసక్తి నెలకొంది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. నారాయణ్ దాస్ నారంగ్ – పి.రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తారు. తెలుగు- తమిళం- హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. అంతే కాదు వేరు వేరు బాషల నుంచి నటీనటులను ఈ సినిమాకోసం ఎంపిక చేస్తున్నారట.

ధనుష్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ దర్శక నిర్మాతలు ఆయనను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. శేఖర్ కమ్ముల – నారాయణదాస్ నారంగ్ – సోనాలి నారంగ్ – భరత్ నారంగ్ మరియు పి.రామ్ మోహన్ లను కలసి కాసేపు ముచ్చటించారు. ధనుష్ లాంటి అవార్డు విన్నింగ్ హీరో.. శేఖర్ కమ్ముల లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Accident: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడి కుమారుడికి గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స

SV. Rangarao Rare Photos: ఇంత వరకూ ప్రభుత్వం నుంచి ఏ పద్మలు అందుకోని విశ్వనటచక్రవర్తి ఎస్వీ రంగారావు జయంతి నేడు.. రేర్ పిక్స్ మీ కోసం

Jani Master: బీస్ట్ సెట్లో స్టార్ కొరియోగ్రాఫర్ బర్త్ డే సెలబ్రేషన్స్… జానీ మాస్టర్ ను ఆప్యాయంగా హత్తుకున్న దళపతి