Jani Master: బీస్ట్ సెట్లో స్టార్ కొరియోగ్రాఫర్ బర్త్ డే సెలబ్రేషన్స్… జానీ మాస్టర్ ను ఆప్యాయంగా హత్తుకున్న దళపతి

దళపతి విజయ్ సినిమా అంటే ఆ క్రేజు.. ఆ రేంజ్ వేరే లెవల్ లో ఉంటాయి. విజయ్ సినిమాలు అవలీలగా 100కోట్ల వసూళ్లను దాటేస్తాయి.

Jani Master: బీస్ట్ సెట్లో స్టార్ కొరియోగ్రాఫర్ బర్త్ డే సెలబ్రేషన్స్... జానీ మాస్టర్ ను ఆప్యాయంగా హత్తుకున్న దళపతి
Jani Master
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 03, 2021 | 8:35 AM

Jani Master: దళపతి విజయ్ సినిమా అంటే ఆ క్రేజు.. ఆ రేంజ్ వేరే లెవల్ లో ఉంటాయి. విజయ్ సినిమాలు అవలీలగా 100కోట్ల వసూళ్లను దాటేస్తాయి. ఇటీవల వరుస సినిమాలతో విజయ్ దుమ్మురేపుతున్నాడు. అభిమానులకు కిక్ ఇచ్చే కథలను ఎంచుకుంటూ బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇటీవలే మాస్టర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దళపతి ఇప్పుడు బీస్ట్ గా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి  సిద్ధం అవుతున్నాడు. విజయ్ బీస్ట్ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. బీస్ట్ సినిమాను డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ చెన్నై లో మొదలైంది. ముందుగా విజయ్- పూజా లపై సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఈ పాటకు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేయనున్నారు. ఇటీవల జానీ మాస్టర్ పేరు ఇండస్ట్రీ లో బాగా వినిపిస్తుంది. ఇటీవలే సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ సినిమాలో సీటీమార్ సాంగ్ కు డాన్స్ కొరియోగ్రాఫ్. చేసి నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా దళపతి విజయ్ తో స్టెప్పులేయిస్తున్నాడు.

అయితే విజయ్ బీస్ట్ మూవీలో అన్ని పాటలకు జానీ డాన్స్ కంపోజ్ చేస్తుండటం విశేషం. తాజాగా సెట్ లో జానీ మాస్టర్ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసారు చిత్రయూనిట్. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోచక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలలో జానీ మాస్టర్ విజయ్ ను ఆప్యాయంగా కౌగిలించుకుని నవ్వుతూ కనిపించరు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జానీ మాస్టర్ కు విజయ్ అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే  జానీ మాస్టర్ ఇటీవలే హీరోగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జానీ మాస్టర్ హీరోగా రెండు సినిమాలు రాబోతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా చార్మి సినిమా..?? సోషల్ మీడియాలో వార్త హల్‌చల్‌ ( వీడియో )

Shahid Kapoor: కొత్తింటిని కొనుగోలు చేసిన షాహిద్‌ కపూర్.. ఈ డూప్లెక్స్‌ ఫ్లాట్‌ ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

F3 Movie : ‘మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు’ పెట్టిన అనిల్.. ‘ఎఫ్ 3’ సెట్ లో సందడే సందడి