F3 Movie : ‘మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు’ పెట్టిన అనిల్.. ‘ఎఫ్ 3’ సెట్ లో సందడే సందడి

టాలీవుడ్ లో నవ్వులు పూయిస్తూ సూపర్ హిట్ అందుకుంటున్న దర్శకుడు అనీల్ రావిపూడి. ఈ యంగ్ డైరెక్టర్ చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులోను ఆకట్టుకుంటున్నాయి.

F3 Movie : 'మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు' పెట్టిన అనిల్.. 'ఎఫ్ 3' సెట్ లో సందడే సందడి
F3 Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 03, 2021 | 7:58 AM

F3 Movie : టాలీవుడ్ లో నవ్వులు పూయిస్తూ సూపర్ హిట్ అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ యంగ్ డైరెక్టర్ చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులోను ఆకట్టుకుంటున్నాయి. తక్కువ సినిమాలే చేసినప్పటికీ  అన్ని హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో అనీల్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు. నిన్న మొన్నటిదాకా మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చిన ఈ కుర్ర దర్శకుడు.. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసి ఏకంగా భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మహేష్ ను సరిలేరు నీకెవ్వరు అంటూ పొగిడిన అనీల్ ఆయన అభిమానుల చేత అదే అనిపించాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాను చేస్తున్నాడు అనిల్. గతంలో సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ తో కలిసి ఎఫ్ 2అనే మల్టీస్టారర్ సినిమా చేసాడు . ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో పడ్డాడు అనిల్ .

ఎఫ్ 2కి మించి ఈ సినిమా నవ్వులు పూయించనున్నాడు అనిల్. కరోనా కంటే ముందే మొదలైన ఈ సినిమా షూటింగ్… ఆ తర్వాత లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా కాస్త గ్యాప్ ఇవ్వడంతో షూటింగ్ లు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. దాంతో ఎఫ్ 3 సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టాడు అనిల్. సెట్స్ లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలతో చిత్రీకరణ చేస్తున్నారు. వెంకటేశ్ – వరుణ్ తేజ్ లతో పాటుగా మిగిలిన నటీనటులు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు.  మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లో మరింత ఫన్ ను జతచేయనున్నాడు అనిల్. ”నా ఫేవరేట్ కోబ్రాస్ తో తిరిగి షూటింగ్ ప్రారంభించాం. మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా – మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ – సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అనిల్ రావిపూడి ట్వీట్ ..

మరిన్ని ఇక్కడ చదవండి :

YS Jagan Biopic: సీఎం జగన్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు రంగం సిద్దం… ( వీడియో )

Bandla Ganesh: అంతరిక్షంలోకి వెళుతోన్న తొలి తెలుగు మహిళ.. బండ్ల గణేశ్‌కు బంధువా.? వైరల్‌గా మారిన ట్వీట్‌..

Anchor Prashanthi: ఇతర భాషనటులకి ఇచ్చిన అవకాశాలను తెలుగు వారికి తెలుగు ఇండస్ట్రీ ఇవ్వదని ప్రశాంతి ఆవేదన