Bandla Ganesh: అంతరిక్షంలోకి వెళుతోన్న తొలి తెలుగు మహిళను పొగుడుతూ బండ్ల గణేశ్‌ ట్వీట్‌.. గర్విస్తున్నామంటూ.

Bandla Ganesh: అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న తొలి తెలుగు మహిళగా శిరీష పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. నిన్నంతా శిరీషకు సంబంధించిన వార్తలు తెగ హల్చల్‌ చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల..

Bandla Ganesh: అంతరిక్షంలోకి వెళుతోన్న తొలి తెలుగు మహిళను పొగుడుతూ బండ్ల గణేశ్‌ ట్వీట్‌.. గర్విస్తున్నామంటూ.
Bandla Ganesh
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 03, 2021 | 1:23 PM

Bandla Ganesh: అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న తొలి తెలుగు మహిళగా శిరీష పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. నిన్నంతా శిరీషకు సంబంధించిన వార్తలు తెగ హల్చల్‌ చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల మరికొన్ని రోజుల్లో అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు. వర్జిన్‌ గెలాక్టిన్‌ యూనిటీ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా ఆమె అంతరిక్షంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఈ వ్యోమనౌకను నింగిలోకి పంపనుంది. ఇందులో సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్‌తోపాటు ఐదుగురు ప్రయాణికులు ఉంటారు. వీరిలో సంస్థ ఉపాధ్యక్షురాలు, తెలుగు యువతి శిరీష​కూడా ఉన్నారు. దీంతో ఆమెపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ విషయమై బండ్ల గణేశ్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు ఆసక్తికరగా మారింది. శిరీష సాధించిన ఈ ఘనతపై బండ్ల ట్వీట్ చేస్తూ.. ‘డాక్టర్‌ మురళీధర్‌ బండ్ల, అనురాధ బండ్ల గార్ల కూతురు శిరీష బండ్ల జులై 11 ఉదయం 9 గంటలకు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. నీ విజయం పట్ల మాకు ఎంతో గర్వంగా ఉంది శిరీష. శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్‌ కాస్త వైరల్‌గా మారింది. ఇంతకీ శిరీష.. బండ్లా గణేశ్‌కు బంధువు అవుతుందా? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కొందరు నెటిజన్లు ఇదే ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే శిరీష కుటుంబానికి బండ్ల గణేశ్‌కు ఎలాంటి బంధుత్వం లేదని. కేవలం తెలుగు మహిళ కాబట్టే గణేశ్‌ శిరీషను పొగుడుతూ ట్వీట్ చేశాడని తెలుస్తోంది.

బండ్ల గణేశ్ చేసిన ట్వీట్..

Also Read: Minister KTR: ఇక లాభం లేదని మంత్రి‌ కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు.. అది తెలిసి షాక్ అయిన అధికారులు ఏం చేశారంటే..

Anchor Prashanthi: ఇతర భాషనటులకి ఇచ్చిన అవకాశాలను తెలుగు వారికి తెలుగు ఇండస్ట్రీ ఇవ్వదని ప్రశాంతి ఆవేదన

Covid 19 Vaccine: కరోనా సెకండ్ డోస్ వేయట్లేదని వాచ్‌మన్ ఆగ్రహం.. ఏకంగా ఆరోగ్య కేంద్రంలోనే..