Anchor Prashanthi: ఇతర భాషనటులకి ఇచ్చిన అవకాశాలను తెలుగు వారికి తెలుగు ఇండస్ట్రీ ఇవ్వదని ప్రశాంతి ఆవేదన
Anchor Prashanthi: అచ్చ తెలుగు అమ్మాయి ప్రశాంతి.. బుల్లి తెరపై యాంకర్ గా అడుగు పెట్టి ప్రేక్షకులను అలరించింది. ఎఫైర్ సినిమాతో నటిగా మారి సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టింది. టాలీవుడ్ లో అవకాశాల కోసం గట్టిగానే..
![Anchor Prashanthi: ఇతర భాషనటులకి ఇచ్చిన అవకాశాలను తెలుగు వారికి తెలుగు ఇండస్ట్రీ ఇవ్వదని ప్రశాంతి ఆవేదన](https://images.tv9telugu.com/wp-content/uploads/2021/07/anchor-prasanthi.jpg?w=1280)
Anchor Prashanthi: అచ్చ తెలుగు అమ్మాయి ప్రశాంతి.. బుల్లి తెరపై యాంకర్ గా అడుగు పెట్టి ప్రేక్షకులను అలరించింది. ఎఫైర్ సినిమాతో నటిగా మారి సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టింది. టాలీవుడ్ లో అవకాశాల కోసం గట్టిగానే కష్టపడింది. కానీ తగినంత గుర్తింపు దక్కలేదు.. నిజానికి యాంకర్ ప్రశాంతిని అందరూ మర్చిపోతున్న సమయంలో ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ లో వస్తున్న గృహ లక్ష్మి సీరియల్ లో లాస్య పాత్రతో మళ్ళీ బుల్లి తెరపై నటిగా అడుగు పెట్టింది.
స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతోన్న ‘గృహలక్ష్మి’ సీరియల్ బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. మంచి టీఆర్పీ దక్కించుకుంటుంది. ఈ సీరియల్ లో నెగెటివ్ పాత్రలో నటిస్తుంది. లాస్య క్యారెక్టర్ లో ప్రశాంతి జీవిస్తోంది అని చెప్పవచ్చు. లాస్య క్యారెక్టర్‌కు ఆమె పెర్ఫెక్ట్ గా సూటయ్యిందనే పేరొచ్చింది.
ఒకప్పుడు స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా సత్తా చాటిన తెలుగింటి అమ్మాయి ప్రశాంతి.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం కష్టపడింది. చివరికి అదృష్టం గృహలక్ష్మి సీరియల్ ద్వారా తలుపు తట్టింది. లాస్య గా నటిస్తూ.. తనను తాను నిరూపించుకున్న ప్రశాంతి తాజాగా చిత్ర పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేశారు.
తెలుగు వాళ్లలో చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ఉన్నారని.. వాళ్లందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్లు ఒక్కొక్కరూ ఒక్కో ఆణిముత్యాలే అవుతారని అన్నారు. అయితే పరాయి భాష నటులకు ఇచ్చే అవకాశాలను తెలుగు కళాకారులకు ఇవ్వడం లేదని.. వాపోయారు. కొంత మంది అవకాశాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు.. మరికొందరు తమలోని టాలెంట్ ను పక్కన పెట్టి… పొట్ట కూటి కోసం వివిధ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు అంటూ లాస్య ఆవేదన వ్యక్తం చేసింది.
పప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే చాలా బాధగా ఉందని.. ఇతర భాషా నటులను తెలుగు ఇండస్ట్రీకి తెచ్చి ఎంకరేజ్ చేస్తుంటారు.. వారికీ వరసగా అవకాశాలను ఇస్తుంటారు… అదే అవకాశాలను మంచి నటీనటులను గుర్తించి ఇస్తే బాగుంటుందని అన్నారు ప్రశాంతి. అంతేకాదు ఇక్కడ చాలా మంది టాలెంటెడ్ నటీనటులు ఉన్నారని.. మన ఇండస్ట్రీ ముందు తెలుగు వాళ్లను ప్రోత్సహించాలని కోరారు.
View this post on Instagram
Also Read: సర్వరోగ నివారిణి.. మహా ఓషది శొంఠి… వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందో తెలుసా