Dry Ginger Benefits: సర్వరోగ నివారిణి.. మహా ఓషది శొంఠి… వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందో తెలుసా

Dry Ginger Benefits: సర్వరోగ నివారిణి.. ఈ మహా ఓషది శొంఠి. ఈ భూమి మీద అతి విలువైన, అనేక రోగాలను నయం చేయగలిగిన మహా మూలికల్లో ఒకటి శొంఠి. దీనిలోని అపూర్వమైన గుణాలను తెలుసుకున్న మన మహర్షులు..

Dry Ginger Benefits: సర్వరోగ నివారిణి.. మహా ఓషది శొంఠి... వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందో తెలుసా
Dry Ginger
Follow us
Surya Kala

|

Updated on: Jul 03, 2021 | 6:41 AM

Dry Ginger Benefits: సర్వరోగ నివారిణి.. ఈ మహా ఓషది శొంఠి. ఈ భూమి మీద అతి విలువైన, అనేక రోగాలను నయం చేయగలిగిన మహా మూలికల్లో ఒకటి శొంఠి. దీనిలోని అపూర్వమైన గుణాలను తెలుసుకున్న మన మహర్షులు దీని శక్తికి గుర్తించి మహా ఓషది అని అర్థం వచ్చేటట్లుగా విశ్వభేజనం అని నామకరణం చేశారు. అందుకనే శొంఠిని సంస్కృతంలో మహా ఓషది, లేదా విశ్వభేషణం అని అంటారు.  అల్లం పై పొట్టు ని తీసి సున్నపుతేటలో ముంచి ఎండబెడితే సొంఠిగా మారుతుంది. ముఖ్యంగా శొంఠి వర్షాకాలం ఇంట్లో వుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో తరచూ తడవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురవుతాయి. జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది.

*మానవునిలో జీవనశక్తిని ( వ్యాధినిరోధక శక్తి) వృద్ధి చేస్తుంది. *కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ని తగ్గిస్తుంది. *మూత్రపిండ రోగాలను తగ్గిస్తుంది. *పురుషులకు వీర్యవృద్ధి చేస్తుంది. *శ్వాశ రోగాలను, ఉదరశూలాలను, దగ్గులను, హృదయ రోగములను, బోదకాలను, వాత రోగములను తగ్గిస్తుంది. *ఉదరములో గ్యాస్ ఎక్కువైనపుడు గుండెలో నొప్పి వస్తుంది. ఈ సమస్య కోసం పావు చెంచా శొంఠిపొడిని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే గ్యాస్ తగ్గి ఉపశమనం లభిస్తుంది. *దోరగా వేయించిన శొంఠి పొడిని మేక పాలతో కలిపి సేవిస్తే విష జ్వరాలు తగ్గిపోతాయి. *ఒకవైపు తలనొప్పి వచ్చేవారు శొంఠిని నీటితో కలిపి మెత్తగా నూరి నుదుటిపైన పట్టు వేస్తే ఆ నొప్పి తగ్గుతుంది. *జాయింట్లలో వాపు (ఆమవాతము) వచ్చి విపరీతమైన నొప్పి తో బాధపడే వారు దోరగా వేయించిన శొంఠి పొడి అరచెంచా మోతాదు గా చెరకు రసంలో కలిపి సేవిస్తూ ఉంటే ఈ సమస్య తొందరగా తగ్గుతుంది. *కొంతమందికి పొట్ట మందగించి ఆకలి కాకుండా ఉంటుంది. అలాంటి వారు దోరగా వేయించిన శొంఠి 50గ్రా, పాతబెల్లం 100గ్రా కలిపి మెత్తగా దంచి నిలువ ఉంచుకుని రోజూ రెండుపూటలా 5గ్రా మోతాడుతో సేవిస్తూ వస్తే మందాగ్ని హరించిపోయి మంచి ఆకలి పుడుతుంది. *రక్తక్షీణత వల్ల వచ్చే పాండు రోగాలకు శొంఠిని నున్నని రాతి మీద అరగదీసిన గంధము 10గ్రా తీసుకుని దానిని 50గ్రా ఆవు నెయ్యిలో వేసి నెయ్యిని కరగబెట్టి దించి ఆ నెయ్యిని రోజు ఆహారంలో వాడుతూ ఉంటే పాండురోగము తగ్గి రక్తము వృద్ధి చెందును. *పక్షవాతంతో బాధపడేవారు దోరగా వేయించిన శొంఠిపొడి, సైందవ లవణం పొడి రోజూ మూడుపూటలా గోరు వెచ్చని నీటిలో గాని, తేనెతో గానీ కలిపి ఆహారం తర్వాత తీసుకుంటూ ఉంటే క్రమంగా పక్షవాతం తగ్గుముఖం పడుతుంది. *నడుం నొప్పి ఉన్నవారు రోజు రాత్రిపూట నిద్రపోయేముందు చిటికెడు శొంఠిని ఒక చెంచా వంటాముదంతో కలిపి తాగుతూవుంటే నడుము నొప్పి, పక్కటెముకల నొప్పి, ఉదరశూల తగ్గుతుంది. *వేడి అన్నంలో శొంఠి పొడిని, పప్పునూనెను కలిపి ప్రతీ రోజూ మొదటి ముద్దగా తింటే అజీర్తి పోయి ఆకలి పెరుగుతుంది. *పరగడుపున నీళ్లల్లో శొంఠి పొడి కలిపి మరగించి, అరచెంచా తేనె కలిపి తాగితే కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాదు, బరువూ అదుపులో ఉంటుంది. *ఇంకా ఎన్నో సమస్యలకు ఈ మహా ఓషది పనిచేస్తుంది.

Also Read: తిరుమల తీర్ధయాత్ర ఫలితం దక్కాలంటే శ్రీవారినే కాదు.. ఈ క్షేత్రంలో కొలువైన దేవేరిని దర్శించాల్సిందే..