AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ragi Health Benefits: ఊబకాయంతో బాధపడుతున్నారా..? అయితే రాగులను మీ డైట్‌లో చేర్చండి.. ఎందుకంటే..?

Ragi Amazing Benefits: ఉరుకుల పరుగుల జీవితంలో.. స్థూలకాయం పెద్ద సమస్యగా మారింది. ఊబకాయం కారణంగా మనుషులను అనేక రకాల సమస్యలు, రోగాలు చుట్టుముడుతున్నాయి. అందుకే అందరూ

Ragi Health Benefits: ఊబకాయంతో బాధపడుతున్నారా..? అయితే రాగులను మీ డైట్‌లో చేర్చండి.. ఎందుకంటే..?
Finger Millet Ragi
Shaik Madar Saheb
|

Updated on: Jul 03, 2021 | 11:48 AM

Share

Ragi Amazing Benefits: ఉరుకుల పరుగుల జీవితంలో.. స్థూలకాయం పెద్ద సమస్యగా మారింది. ఊబకాయం కారణంగా మనుషులను అనేక రకాల సమస్యలు, రోగాలు చుట్టుముడుతున్నాయి. అందుకే అందరూ ఊబకాయాన్ని వేగంగా తగ్గించుకోవాలని కోరుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉన్నవారు సైతం ఫ్యాట్‌ను తగ్గించుకోవాలని కోరుకుంటారు. అయితే.. బరువు తగ్గడానికి శారీరక వ్యాయామాలతోపాటు.. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గడానికి రాగులు మంచి ఔషధంలా పనిచేస్తాయి. ఫింగర్ మిల్లెట్స్ వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రాగిలో సున్నా శాతం కొలెస్ట్రాల్, సోడియం ఉన్నాయి. కొవ్వు 7 శాతం మాత్రమే ఉంది. వీటితోపాటు.. కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు లాంటివి రాగుల్లో పుష్కలంగా దాగున్నాయి. వీటిని రోజూ ఆహారంలో చేర్చడం ద్వారా మీ శరీరానికి అవసరమైన పోషకాలు లభించడంతోపాటు.. బరువు కూడా సులువుగా నియంత్రించుకోవచ్చు. అయితే.. రాగుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

ఎముకలకు మేలు.. రాగులు ఎముకల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంది. 100 గ్రాముల రాగుల్లో 344 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. వీటిని మీ ఆహారంలో చేర్చితే.. ఎముకలను బలంగా మార్చడంతోపాటు.. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుండెకు మంచిదే.. రాగుల్లో కొలెస్ట్రాల్, సోడియం లేకుండా.. ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాగులు తినడం ద్వారా కొలెస్ట్రాల్, బిపిని తగ్గించుకోవచ్చు. ఫలితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

బరువును నియంత్రించుకోవచ్చు.. రాగిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తిన్న తరువాత కడుపు చాలా సేపు నిండి ఉంటుంది. ఆకలి వేయదు. దీని కారణంగా అతిగా తినడాన్ని అరికట్టడంతోపాటు.. శరీరానికి పోషకాలు కూడా లభిస్తాయి. అందుకే బరువు తగ్గడానికి రాగులు ఉత్తమమని పేర్కొంటున్నారు.

రక్తహీనత.. శరీరంలో ఐరన్ లోపం వల్ల.. రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఆహారంలో చేర్చడం ద్వారా రక్తం హీనత సమస్య తగ్గుతుంది.

డయాబెటిక్ రోగులకు.. డయాబెటిక్ రోగులు.. అల్పాహారం, భోజనంలో రాగులను చేర్చితే.. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. షుగర్ వ్యాధి బారిన పడే అవకాశం కూడా తక్కువ..

ఎలా, ఎవరు తినాలంటే..? ఉదయం అల్పాహార సమయంలో.. మొలకెత్తిన రాగులను తినవచ్చు. దీంతోపాటు రాగి జావను తాగవచ్చు. రాగి పిండితో ఇడ్లీలు, దోశలను తయారు చేసుకొని తినవచ్చు. దీంతోపాటు పలు రకాల వంటలు చేసుకొని తినవచ్చు. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది కావున.. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు.. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వారు తినకూడదు. థైరాయిడ్ రోగులు కూడా రాగులను తినకపోతే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:

లెక్కలు బయటికొస్తున్నాయ్… పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దు రూ. 8 లక్షల కరెంట్ బిల్లు చెల్లించాలట !

PM Kisan FPO Yojana: రైతులకు కేంద్రం శుభవార్త.. ఈ స్కీమ్‌లో చేరితే రూ.15 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే..!