AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan FPO Yojana: రైతులకు కేంద్రం శుభవార్త.. ఈ స్కీమ్‌లో చేరితే రూ.15 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే..!

PM Kisan FPO Yojana: అన్నదాతలకు ఆదాయం మరింత రెట్టింపు చేయడానికి, వారికి ఆర్థికంగా మద్దతు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్లను అందిస్తోంది...

PM Kisan FPO Yojana: రైతులకు కేంద్రం శుభవార్త.. ఈ స్కీమ్‌లో చేరితే రూ.15 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే..!
Farmer Producer Organization Scheme
Subhash Goud
|

Updated on: Jul 03, 2021 | 6:47 AM

Share

PM Kisan FPO Yojana: అన్నదాతలకు ఆదాయం మరింత రెట్టింపు చేయడానికి, వారికి ఆర్థికంగా మద్దతు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్లను అందిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను సైతం ప్రవేశపెట్టింది. రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా మరింతగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తోంది. తాజాగా రైతులకు అందుబాటులో ఉన్న మంచి స్కీమ్‌ ‘పీఎం కిసాన్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ స్కీమ్‌ యోజన’. ఈ పథకం కింద రైతులు అగ్రికల్చర్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి మోదీ ప్రభుత్వం రూ.15 లక్షల ఆర్థిక మద్దతు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఈ స్కీమ్‌ను ప్రకటించింది. అయితే ఈ స్కీమ్‌లో ఎలా చేరాలో, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తదితర పూర్తి వివరాలు చాలా మందికి తెలియవు. ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ స్కీమ్‌ కింద రూ.15 లక్షలు పొందాలంటే 11 మంది రైతులు కలిసి ఒక ఆర్గనైజేషన్‌గా ఏర్పడాల్సి ఉంటుంది.

కంపెనీ చట్టం కింద దీనిని రిజస్ట్రేషన్‌ చేసుకోవాలి. తర్వాత దీని ద్వారా విత్తనాలు, మందులు, ఎరువులు, ఇతర పరికరాలు రైతులకు విక్రయించుకోవచ్చు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం 2023-24 నాటికి 10 వేల ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం ఐదేళ్లపాటు వీటికి సాయం అందిస్తుంది. ఒక్కో ఎఫ్‌పీవోకు మోదీ ప్రభుత్వం రూ.15 లక్షల రుణం అందిస్తుంది. దీని ద్వారా ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసుకొని పనులు ప్రారంభించవచ్చు. ఇలాంటి పథకం ద్వారా రైతులు మరింతగా ఎదగవచ్చు. రైతులను దృష్టిలో ఉంచుకుని మోదీ సర్కార్‌ వారి కోసం కొత్త కొత్త పథకాలను తీసుకువస్తోంది.

ఇవీ కూడా చదవండి

Royal Enfield: జూన్‌ నెలలో దూసుకెళ్లిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు.. మే నెలతో పోలిస్తే ఇది ఎక్కువే

Maruti Suzuki: మారుతి సుజుకీ కారు కొనుగోలు చేసిన వారికి అదిరిపోయే శుభవార్త.. గడువు పొడిగిస్తూ నిర్ణయం..!