Royal Enfield: జూన్‌ నెలలో దూసుకెళ్లిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు.. మే నెలతో పోలిస్తే ఇది ఎక్కువే

Royal Enfield: రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ అమ్మకాలు గత నెలలో దూసుకుపోయాయి. జూన్‌ నెలలో ఏకంగా 43,048 యూనిట్లను అమ్మకాలు జరిగినట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలిపింది..

Subhash Goud

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 02, 2021 | 9:17 AM

Royal Enfield: రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ అమ్మకాలు గత నెలలో దూసుకుపోయాయి. జూన్‌ నెలలో ఏకంగా 43,048 యూనిట్లను అమ్మకాలు జరిగినట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలిపింది. మే నెల అమ్మకాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. మేలో 27,294 యూనిట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. ఇక దేశీయంగా మే నెలలో 20,073 యూనిట్లు విక్రయించగా, జూన్‌లో ఏకంగా 35,815 యూనిట్లు అమ్ముడుపోయాయి.

1 / 4
అలాగే, మే నెలలో 7,221 యూనిట్లు ఎగుమతి చేయగా, జూన్‌లో 7,233 యూనిట్లను ఎగుమతి చేసినట్టు కంపెనీ వెల్లడించింది. మరోవైపు, వోల్వో గ్రూప్, ఐషర్ మోటార్స్ జాయింట్ వెంచర్ అయిన వీఈ కమర్షియల్ వెహికిల్స్ జూన్‌లో 2,438 యూనిట్లు విక్రయించింది.

2 / 4
గత సంవత్సరంతో పోలిస్తే ఇది ఎక్కువే. గత ఏడాది జూన్‌లో 1,358 వాహనాలు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది జూన్‌లో అమ్ముడైన వాటిలో 2,370 వాహనాలు ఐషర్‌వి కాగా, 68 వాహనాలు వోల్వో బ్రాండ్‌వని కంపెనీ పేర్కొంది.

3 / 4
దేశీయ కమర్షియల్‌ వాహన మార్కెట్‌లో ఐషర్‌ బ్రాండ్‌ ట్రక్కులు, బస్సులు 1,760 యూనిట్లు విక్రయాలు జరుగగా, గత ఏడాది ఇదే నెలలో 1,061 యూనిట్లు అమ్ముడైనట్టు కంపెనీ వివరించింది. అలాగే గత నెలలో ఐషర్ ట్రక్కులు, బస్సులు కలిపి 610 యూనిట్లు ఎగుమతి చేయగా, గత ఏడాదిది ఇదే నెలలో 305 యూనిట్లు మాత్రమే ఎగుమతి అయ్యాయని తెలిపింది. అలాగే వోల్వో ట్రక్కులు, బస్సులు జూన్‌లో 68 యూనిట్లు విక్రయాలు జరుగగా,గత ఏడాది ఇదే నెలలో 37 యూనిట్లు మాత్రమే విక్రయాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది.

4 / 4
Follow us