- Telugu News Photo Gallery Business photos National pharmaceutical pricing authority approves price rise of 50 per cent for carbamazepine ranitidine ibuprofen
NPPA: వినియోగదారులకు షాకింగ్.. భారీగా పెరగనున్న మూడు డ్రగ్స్ ధరలు.. పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ఎన్‌పీపీఏ
ప్రస్తుతం మార్కెట్లో అన్ని వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతుననాయి. నిరుపేద వారికి ఈ మెడిసిన్ ధరల పెరుగుదల ఎన్నో ఇబ్బందులు పెచ్చి పెడుతున్నాయి..
Updated on: Jul 03, 2021 | 8:49 AM

ప్రస్తుతం మార్కెట్లో అన్ని వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతుననాయి. నిరుపేద వారికి ఈ మెడిసిన్ ధరల పెరుగుదల ఎన్నో ఇబ్బందులు పెచ్చి పెడుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరిచేలా ఉంటే తాజాగా ఈ డ్రగ్స్ ధరలు మరింత ఇబ్బందులకు గురి చేయనున్నాయి.

సాధారణ వ్యాధుల చికిత్స కోసం అధికంగా వినియోగించే మూడు కీలక ఔషధాల ధరల పెంపునకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) ఆయా కంపెనీలను అనుమతించింది. అన్ని ధరలు పెరుగుతున్నాయి నేనేమి తక్కువ కాదన్నట్లుగా వ్యాధుల కోసం ఉపయోగించే ఈ ఔషధాల కోసం ధరలు కూడా పెరిగిపోతున్నాయి.

కార్బమజిపైన్, రానిటిడైన్, ఐబుప్రొఫెన్ డ్రగ్స్ ప్రథమ చికిత్సకు ఉపయోగించేవి అయినందున వాటి నిరంతర లభ్యత దేశంలో ప్రజారోగ్య కార్యక్రమానికి అవసరమని ఎన్‌పీపీఏ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ధరలను 50 శాతం వరకు పెంచుకునేందుకు ఎన్‌పీపీఏ అనుమతి ఇచ్చిందని తెలుస్తోంది.

ధరల నియంత్రణ పరిధిలో ఉన్న వీటి ధరల్ని పెంచకపోతే, మార్కెట్లో వీటి లభ్యత కరువై, ప్రజలు ఖరీదైన ప్రత్యామ్నాయ ఔషధాలవైపు మళ్లాల్సి వస్తుందని అథారిటీ వివరించింది. అత్యవసరమైన వ్యాధులకు చికిత్సలో భాగంగా వీటి ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది.




