లెక్కలు బయటికొస్తున్నాయ్… పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దు రూ. 8 లక్షల కరెంట్ బిల్లు చెల్లించాలట !

లెక్కలు బయటికొస్తున్నాయ్... పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దు రూ. 8 లక్షల కరెంట్ బిల్లు చెల్లించాలట !
Navjot Singh Sidhu

పంజాబ్ సీఎం అమరందర్ సింగ్ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రాష్ట్ర మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు కరెంట్ బిల్లు రూ. 8 లక్షల బకాయిలు చెల్లించాలట..

Umakanth Rao

| Edited By: Phani CH

Jul 03, 2021 | 9:10 AM

పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రాష్ట్ర మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు కరెంట్ బిల్లు రూ. 8 లక్షల బకాయిలు చెల్లించాలట.. రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో సిద్దు . లాబీయింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇటీవల పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో..ఇప్పటివరకూ లేనిది తాజాగా ఆయన కరెంట్ బిల్లు చెల్లింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సిద్దు తమ విద్యుత్ సంస్థకు రూ. 8 లక్షలకు పైగా బకాయిలు చెల్లించవలసి ఉందంటూ పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ తన వెబ్ సైట్ లో తెలిపింది. ఆయన రూ. 8,67,540 పే చేయాల్సి ఉందని వెల్లడించింది. ఈ చెల్లింపు గడువు నిన్నటితో ముగిసిపోయింది. గత ఏడాది నుంచి సిద్దు 17 లక్షలకు పైగా కరెంట్ బిల్లు చెల్లించవలసి ఉండగా మార్చి నెలలో 10 లక్షలు చెల్లించారు. ఆ తరువాత నుంచి ఒక్క రూపాయి కూడా కట్టలేదని తెలిసింది. కాగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి సీఎం అమరేందర్ సింగే బాధ్యుడని సిద్దు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి సరైన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని అంటున్నారు.

విద్యుత్ శాఖను కూడా ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తున్నారని ఆయన అంటున్నారు. పవర్ కట్స్ కి పూర్తిగా ఈ ముఖ్యమంత్రిదే బాధ్యత అని ఆరోపిస్తున్నారు. కాగా 8 లక్షల బకాయిల విషయమై ఆయనను సంప్రదించడానికి యత్నించగా.. అందుబాటులో లేరని సమాధానం వచ్చింది. 2019 లో సిద్దు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేబినెట్ లో తన స్థాయిని తగ్గించినందుకు ఈ మాజీ క్రికెటర్ అలిగి ఈ చర్య తీసుకున్నారు. అప్పటి నుంచి సీఎం అమరేందర్ సింగ్ కి, ఈయనకు మధ్య విభేదాలు పెరిగాయి. పంజాబ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలోని విద్యుత్ సంక్షోభం ప్రధాన అంశంగా మారింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Accident: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడి కుమారుడికి గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స

Viral News: బాబోయ్‌ పిల్లలు కాదు పిడుగులు.. స్కూల్‌ ఇలా కూడా డుమ్మా కొట్టచ్చా.!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu