AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dehradun Man: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆపద్భాంధవుడు.. 100 మందిని దత్తత తీసుకున్న..

Dehradun Man: దేశంలో కరోనా వైరస్ అడుగు పెట్టినప్పటి నుంచి లక్షల మంది ప్రాణాలను బలిగొంది. కరోనా బారినపడి కుటుంబ సభ్యులను, స్నేహితులను , సన్నిహితులను ఎంతో మంది కోల్పోయారు. అనేక కుటుంబాలు అల్లకల్లోలంగా..

Dehradun Man:  కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆపద్భాంధవుడు.. 100 మందిని దత్తత తీసుకున్న..
Jai Sharma
Surya Kala
|

Updated on: Jul 03, 2021 | 1:14 PM

Share

Dehradun Man: దేశంలో కరోనా వైరస్ అడుగు పెట్టినప్పటి నుంచి లక్షల మంది ప్రాణాలను బలిగొంది. కరోనా బారినపడి కుటుంబ సభ్యులను, స్నేహితులను , సన్నిహితులను ఎంతో మంది కోల్పోయారు. అనేక కుటుంబాలు అల్లకల్లోలంగా మారాయి. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కన్నవారు లేని ఆ పిల్లల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. ఇలా దేశంలో ఎందరో అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మారిపోయారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి.. అండగా నిలబడడానికి ఓ సామజిక కార్య కర్త ముందుకొచ్చారు. 100 మంది చిన్నారులను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు.

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లోని సామజిక కార్యకర్త జై శర్మ. ఆయనకు చెందిన జాయ్​ (జస్ట్ ఓపెన్ యువర్ సెల్ఫ్​) అనే స్వచ్ఛంద సంస్థ ఇప్పటికే 20 మంది దత్తత తీసుకుంది. అంతేకాదు త్వరలో మరో 80మంది అనాథ చిన్నారులను దత్తత తీసుకోవడానికి సిద్దపడుతుంది. ఈ విషయాన్నీ జాయ్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ లో తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలున్న ఐదు కుటుంబాలను గుర్తించినట్లు తెలిపింది. తల్లిదండ్రుల కరోనాతో మరణించడంతో ఆ చిన్నారులు ఒంటరివారయ్యారు. అనాథలుగా మారారు.. ఇది చూసి తమకు బాధకలిగిందని.. అందుకనే పిల్లలను చేరదీసి.. అండగా నిలబడాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ ద్వారా 20 మంది పిల్లలని దత్తత తీసుకున్నామని.. వారందరికీ తిండి, వసతి, వైద్యం. ఆర్ధికంగా అండ అన్నీ చేసుకుంటున్నామని చెప్పారు జై శర్మ.

ప్రస్తుతానికి 20మంది పిల్లలున్నారని.. మరో వారంలో 50 మంది పిల్లల్ని జాయ్ వద్దకు తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుతానికి 100 మంది పిల్లలను చేరదీయాలని నిర్ణయించినట్లు జాయ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ​అంతేకాదు కరోనా సమయంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల్తో కలిసి దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

జాయ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రోజూ కొన్ని గ్రామాలను సందర్శించి కరోనాతో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలు ఉంటే వారిని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే జై శర్మ ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఆక్సిజన్​ను సైతం ఎన్జీవో తరఫున అందించారు. అలాగే ఎన్జీవో బృందాలు.. కొవిడ్ మెడికల్ కిట్లు, శానిటైజేషన్ కిట్లు, అవసరమైన వారికి వైద్య సాయం చేశాయి. ఈ విషయాలన్నింటినీ జై శర్మ ఫేస్​బుక్​లో ద్వారా తెలిపారు. జై శర్మ చేస్తున్న పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాయం చేయాలంటే కముందుగా కావాల్సింది మంచి మనసు అని అది జై శర్మ కు ఉందని అంటున్నారు.

Also Read:  పదవ తరగతి ఉత్తీర్ణత అయిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టల్ లో ఉద్యోగావకాశాలు