Post Office Recruitment: పదవ తరగతి ఉత్తీర్ణత అయిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టల్ లో ఉద్యోగావకాశాలు

Post Office Recruitment: పదవ తరగతి పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బెంగళూరులోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో పనిచేయుటకు..

Post Office Recruitment: పదవ తరగతి ఉత్తీర్ణత అయిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టల్ లో ఉద్యోగావకాశాలు
Postal Jobs
Follow us
Surya Kala

|

Updated on: Jul 03, 2021 | 11:42 AM

Post Office Recruitment: పదవ తరగతి పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బెంగళూరులోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో పనిచేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మొత్తం 15 ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. గత 10 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ నెల 10 వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది.

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 56 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైనవారికి ఏడో పేకమిషన్ లెవెల్ 2 పే స్కేల్ వర్తిస్తుంది. రూ.19,900 బేసిక్‌తో వేతనం లభిస్తుంది.

దరఖాస్తులను పంపించాల్సిన అడ్రస్ The Manager, Mail Motor Service, Bengaluru-560001. దరఖాస్తు చేసుకోవడానికి ఇంక మూడు రోజులే సమయం ఉంది. చివరి తేదీ లోగా అప్లికేషన్స్ ఈ అడ్రస్‌కు చేరేలా  పంపించాలి

Also Read: సౌందర్యకు, దీపకు పెళ్లి బట్టలు కొన్న మోనిత.. తనకు చిరాకు తెప్పిస్తే.. రచ్చరచ్చ చేస్తానంటూ కార్తీక్ కు వార్నింగ్