Karthika Deepam: సౌందర్యకు, దీపకు పెళ్లి బట్టలు కొన్న మోనిత.. తనకు చిరాకు తెప్పిస్తే.. రచ్చరచ్చ చేస్తానంటూ కార్తీక్ కు వార్నింగ్

Karthika Deepam: సౌందర్యకు, దీపకు పెళ్లి బట్టలు కొన్న మోనిత.. తనకు చిరాకు తెప్పిస్తే.. రచ్చరచ్చ చేస్తానంటూ కార్తీక్ కు వార్నింగ్
Karthika Deeepam

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1082 ఎపిసోడ్ లో అడుగు పెట్టింది. మోనిత కార్తీక్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్న వేళ.. దీప కార్తీక్ నిర్ణయం ఏమిటా అని ఆలోచిస్తుంది. పెళ్లి విషయం నీతో చెప్పలేక నలిగిపోతున్నాడు..

Surya Kala

|

Jul 03, 2021 | 10:49 AM

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1082 ఎపిసోడ్ లో అడుగు పెట్టింది. మోనిత కార్తీక్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్న వేళ.. దీప కార్తీక్ నిర్ణయం ఏమిటా అని ఆలోచిస్తుంది. పెళ్లి విషయం నీతో చెప్పలేక నలిగిపోతున్నాడు అని దీప తో అంటున్న సౌందర్య ని అడ్డగించి.. పాపం నలిగిపోతూనే నిస్సహాయంగా చూస్తూనే దానితో పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. రేపు పెళ్లి చేసుకుని మీ ఇంటికి వస్తే.. మీరు కూడా నిస్సహాయంగా చూస్తూనే దానికి హారతి ఇచ్చి లోపలి రమ్మంటారు.. నేను కడుపుతో గడప డాటా.. అది కడుపుతో గడప లోపాలకి వస్తుంది అంతేకా.. అదేగా జరగబోయేది.. దీప అధైర్య పడకు.. నేను ఉండగా దాని మేడలో తాళి కట్టలేడు అంటుంది ఇంతలో అదే సమయంలో కార్తీక్ కి వేరే నెంబర్ తో మోనిత ఫోన్ చేస్తుంది. నేను నా కడుపులో బిడ్డలా నేను దీపాలా డ్యూయెల్ సిమ్ .. అంటే.. నీకు మర్యాదగా మాట్లాడడం రాదా.. గొంగలి పురుగు పాకినట్లు గా మాట్లాడు .. ప్రియమైన మీతో ప్రియంగానే మాట్లాడతాను ప్రియమైన శ్రీవారు అంటే.. నేను రాను అంటాడు కార్తీక్.. దీంతో మోనిత పెళ్లి డేట్ మరేటట్లు ఉంది.. నీతో మాట్లాడదామంటే రాను అంటున్నవు అంటే.. పర్వాలేదు వస్తా అని బయలు దేరతాడు.. కార్తీక్ ని టిఫిన్ చేసి వెళ్ళమంటే లేదు అని వెళ్తున్న కార్తీక్ ని చూసి దీప అక్కడికేనేమో అంటుంది.

భాగ్య మోనిత పెళ్లి గురించి చెప్పిన విషయం గుర్తు చేసుకుంటూ.. డాక్టర్ బాబు జుట్టు దాని చేతిలో ఉంది.. ఎం చేద్దాం అని ఆలోచిస్తుంటే.. హిమ శౌర్యలు వారణాసికి తీసుకుని వస్తారు.

మోనిత దగ్గరకు వెళ్లిన కార్తీక్ తో ఇది మన ఇల్లు కార్తీక్.. కొత్తల్లుడిలా ఇబ్బందిగా చూస్తావేమిటి రా.. కూర్చో కార్తీక్ అంటుంది. ప్రియమణి ని పిలిచి కార్తీక్ వచ్చాడని చెబుతుంది. దీంతో కార్తీక్ ప్రియమణిని కసురుతాడు. నువ్వు ఆ ఇంట్లో ఉంటావు.. మాములుగా రమ్మంటే రావు.. అందుకే సింపుల్ గా చిన్న అబద్ధం చెప్పను.. రమ్మంటే వచ్చేస్తావని.. మన గురించి పట్టించుకోవా.. మనం అంటే మన ఇద్దరమే కాదు.. ఆరు నెలలు ఆగితే ముగ్గురం అవుతాం.. మీ అమ్మగారికి, దీపకి పెళ్ళికి సాక్షి సంతకాలు చేయడానికి రమ్మని చెబుతావా.. మనం చిన్నప్పటి నుంచి స్నేహితులం.. దీపకంటే నిన్నే ఎక్కువుగా నమ్మాను.. నన్ను ఇలా ఇబ్బంది పెడతావని కలలో కూడా అనుకోలేదు అంటే.. ఫ్రెండ్ అయితే మాత్రం భార్యగా చేసుకోకూడదా.. ఇది ఒక ఆడపిల్ల జీవితం కార్తీక్.. నువ్వు చెబుతున్న మాటే నాకు జీర్ణం కావడం లేదు.. అది నా వ్యక్తిత్వం కాదు.. వినడానికే దారుణంగా ఉంది అంటాడు కార్తీక్. ఇద్దరం కలిసి తప్పు చేసినప్పుడు ఇద్దరం కలిసి సరిద్దుకోక తప్పదు.. సాక్ష్యం నా కడుపులో ఉంది.. అంటే..నిజంగా నా మేడలో తాళి కట్టడానికి దీప ని దూరం చేసుకోవడానికి ప్రతి సారి నీ పెళ్లి తో ముడిపెట్టను.

నీ మీద ప్రేమ మాత్రం కాదు.. అంటే పెళ్లి దగ్గర పడుతుంది నాకు చాలా టెన్షన్ గా ఉంది.. సాయానికి సలహాలకి దీపని మీ అమ్మని రమ్మంటే తిడతావు.. వాళ్ళని మధ్యలోకి లాగకు.. అంటే.. పదేళ్లుగా శ్రీరమ బస్తీలో పడిఉన్నప్పుడు మీ కుటుంబ గౌరవం ఏముంది అంటే.. షటప్ మోనిత వాళ్ళు అలా కావడానికి కారణం నేను అంటే.. నేను అలా కాను.. నీకు ఆ ఛాన్స్ ఇవ్వను అంటుంది. ప్రియమణి అని పిలిచి పేకెట్స్ తీసుకుని రమ్మనమని చెబుతుంది.

చీరలు తీసి సౌందర్య, దీప, శ్రావ్య, ప్రియమణి లకు చీరలు కొన్నానని చెబుతుంది. నాకు గానీ చిరాకు తెప్పించావంటే.. రచ్చ రచ్చ చేస్తా అంటే. ప్రియమణి అవునయ్యా.. అంటూ మోనిత కు వంత పాడుతుంది. మోనిత దీపకు వీడియో కాల్ చేసి.. దీప ఈ చీరల్లో నీకు ఏ చీర నచ్చిందో మన కార్తీక్ అడగమన్నాడు అని కార్తీక్ ని చూపిస్తుంది. బట్టలు షాపింగ్ కూడా అయ్యిందన్నమాట.. అంటుంది దీప.. మోనిత దీపకి కోపం వచ్చింది రేపు సాక్షి సంతకం అడిగితె ఏమి చేస్తుందో అని అంటుంది.

సరోజక్క గాజులు ఇవ్వమనని అడిగితె.. వంద రూపాయలు ఇచ్చి వారణాసి ఆటోలో పంపించా.. గాజులు పాతబడొచ్చు.. రోజులు పాతబడొచ్చు కానీ కాపురం పాతబడదు కదా అత్తయ్యా అంటుంది దీప. పదేళ్లయినా 25 ఏళ్ళైనా ఎన్నేళ్లు అయినా భర్త చేతిలోనే పుణ్య స్త్రీగా పోవాలని కోరుకుంటుంది. ఇప్పుడు మోనిత వచ్చి ఏదేదో అడుగుతుంది. కడుపుతో ఉంది కదా అని అది కోరిన కోరికలు తీర్చాలా అని సౌందర్య ను ప్రశ్నిస్తుంది దీప. ఈయన తలవంచి నన్ను తలవంచమంటే.. నేను తలవంచాలా.. ఇప్పుడు అక్కడికి వెళ్లి.. దాని పెళ్లి బట్టలు సెలక్షన్ చేయమని నాకు చూపించిన మీ కొడుకుని అమాయకుడు అనుకోవాలా రచ్చ చేయాలా అని అడుగు తుంది దీప నాకు తెలుసు ఇలాంటి సమయంలో నువ్వు ఎలా ఆలోచిస్తావో.. అసలు వాడు దానిని అంటుంటే.. మళ్ళీ మీ కొడుకుని సపోర్ట్ చేసే పని వద్దు అత్తయ్య అంటుంది. నేను సమర్ధించడం లేదు దీప..నా పెంపకాన్ని అనుమానించకు.. ఇన్నాళ్లు మోనిత ను వేరే దృష్టిలో చూడలేదు అంటే.. వేరే దృష్టిలో చూడకుండానే పెళ్లి వరకూ వెళ్లాడా అని ప్రశ్నిస్తుంది దీప

Also Read: ఇంత వరకూ ప్రభుత్వం నుంచి ఏ పద్మలు అందుకోని విశ్వనటచక్రవర్తి ఎస్వీ రంగారావు జయంతి నేడు.. రేర్ పిక్స్ మీ కోసం 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu