AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Effect : విద్యావ్యవస్థపై కరోనా ప్రభావం..! అడ్మిషన్లు లేక మూతపడుతున్న కళాశాలలు.. పలు కోర్సుల రద్దు

Corona Effect : కరోనా ప్రభావం వల్ల దేశంలో అన్ని రంగాలు కుదేలయ్యాయి.. ముఖ్యంగా విద్యావ్యవస్థపై చాలా ప్రభావం పడింది. కరోనా దెబ్బకు స్కూళ్ళు,

Corona Effect : విద్యావ్యవస్థపై కరోనా ప్రభావం..! అడ్మిషన్లు లేక మూతపడుతున్న కళాశాలలు.. పలు కోర్సుల రద్దు
Education System
uppula Raju
|

Updated on: Jul 03, 2021 | 5:34 PM

Share

Corona Effect : కరోనా ప్రభావం వల్ల దేశంలో అన్ని రంగాలు కుదేలయ్యాయి.. ముఖ్యంగా విద్యావ్యవస్థపై చాలా ప్రభావం పడింది. కరోనా దెబ్బకు స్కూళ్ళు, కళాశాలలు నడపలేక ఏకంగా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు విద్యార్థులు కూడా ఏ కోర్సులు పడితే ఆ కోర్సులు కాకుండా త్వరగా సెటిల్ అయ్యేలా ఉండే కోర్సులు ఎంచుకుంటుండటంతో ఇంజనీరింగ్ కళాశాలలు కూడా చేతులెత్తేస్తున్నాయి. పలు కోర్సులకు డిమాండ్ లేక తమ కాలేజీలో ఆయా కోర్సులను రద్దు చేసు కుంటున్నాయి. విద్యార్థులు లేక కొత్త అడ్మిషన్లు రాక, వచ్చిన అరకొర అడ్మిషన్ల తో కళాశాలను నడపలేక పలు కళాశాలలు మూతపడుతున్నాయి.

చాలా ప్రైవేట్ కాలేజీలు దోస్త్ నుంచి విరమించుకుంటున్నాయి. ఎందుకంటే విద్యార్థులకు తరగతులు నిర్వహించ లేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక ఉపసంహరించుకుంటున్నట్లు చెబుతున్నారు. వచ్చే నిర్వహణ వ్యయం సరిపోలిక, ఫీజు రియంబర్స్మెంట్ సమయానికి అందక దాదాపు వంద వరకు కళాశాలలు ఉపసంహరణ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. 2014 కన్నా ముందు ఉమ్మడి రాష్ట్రంలో అవసరానికి మించి కళాశాలలకు అనుమతులు ఇవ్వడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు.

ఇంటర్మీడియట్ పాస్ అయ్యే విద్యార్థుల కంటే లక్ష నుంచి రెండు లక్షల వరకు డిగ్రీ కళాశాలలో అదనంగా సీట్లు ఉండడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తింది అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక కళాశాల కు కూడా పర్మిషన్ ఇవ్వలేదనీ కొత్త కళాశాలలు అవసరం లేకుండా ఉన్న వాటిలోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న సంకల్పం తో ఉన్నట్లు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జులై 1న యూనివర్సిటీ విసీల తో జరిగిన సమావేశంలో జీరో అడ్మిషన్ ఉన్న కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరు విశ్వవిద్యాలయాల నుంచి గుర్తింపు రద్దు చేసుకున్న కళాశాలల వివరాలు పరిశీలిస్తే కాకతీయ యూనివర్సిటీలో 19, మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో 16, ఉస్మానియా యూనివర్సిటీ లో 23, పాలమూరు యూనివర్సిటీ లో 5, శాతవాహన యూనివర్సిటీ లో 6, తెలంగాణ యూనివర్సిటీలో 3, కళాశాలలు తమ ఒప్పందాలన్నీ ఉపసంహరించుకున్నాయి. ఇక ఇంజనీరింగ్ కాలేజీలను పరిశీలిస్తే 40 నుండి 50 కాలేజీలు అడ్మిషన్స్ లేక పలు కోర్సులను ఉపసంహరణకు ఆయా సంబంధిత యూనివర్సిటీలకు ప్రతిపాదనలు పంపాయి. కొన్ని కోర్సులకు మాత్రమే డిమాండ్ ఉండడంతో విద్యార్థులు డిమాండ్ ఉన్న కోర్సుల్లో మాత్రమే చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఉపాధి అవకాశాలు ఎందులో ఎక్కువగా ఉన్నాయో వాటి వైపు విద్యార్థులు మొగ్గుచూపుతుండటంతో మిగిలిన కోర్సులకు డిమాండ్ తక్కువగా ఉంటుంది.

కాలానికి అనుగుణంగా కోర్సుల్లో కూడా డిమాండ్ పెరుగుతుండడంతో సర్క్యూట్ బ్రాంచెస్ అయిన సి ఎస్ ఈ, , ఎ ఎస్ సి, ట్రిపుల్ ఈ ఏ సిటీ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు వీటిపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. వాస్తవానికి ఇంజనీరింగ్ కు డిమాండ్ బాగానే ఉన్నా అడ్మిషన్స్ పెరుగుతున్నప్పటికీ డిమాండ్ ఉన్న కోర్సుల వైపు విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు. దీంతో కొన్ని కోర్సులు మూసివేయి తప్పడం లేదు అంటున్నారు విద్యావేత్తలు. ఎన్ ఐ టి, ఐ ఐ టి, ట్రిపుల్ ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీస్ లాంటి వాటిలో సివిల్, మెకానికల్, కెమికల్ లాంటి కోర్సుల్లో సరిపడా సీట్లు ఉండడంతో మిగిలిన కాలేజీలోకి విద్యార్థులు వెళ్లడం లేదు అంటున్నారు.

(గొల్లపల్లి వెంకటరత్నం, TV9 తెలుగు రిపోర్టర్, హైదరాబాద్)

Gandhi Bhavan: గాంధీభవన్‌ను వదలని వాస్తుదోషం.. భారీగా మార్పులు మొదలు పెట్టిన కొత్త చీఫ్

Fact Check : కొవిడ్ రిలీఫ్ కింద ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రూ.4 వేలు అందిస్తుందా..! అసలు విషయం ఏంటో తెలుసుకోండి..

Crime News: గ్యాంగ్ రేప్ నిందితులు.. కేసు పెట్టారని బాధితురాలి సోదరుడి మర్మాంగం కోసేశారు