AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: గ్యాంగ్ రేప్ నిందితులు.. కేసు పెట్టారని బాధితురాలి సోదరుడి మర్మాంగం కోసేశారు

ఉత్తర్​ప్రదేశ్​లోని సుల్తాన్​పుర్​ జిల్లా అర్జున్​పుర్​లో దారుణ ఘటన జరిగింది. తమపై కేసు పెట్టారన్న కోపంతో ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసేశారు కొందరు దుండగులు. గత నెల 26న జరిగిన...

Crime News:  గ్యాంగ్ రేప్ నిందితులు.. కేసు పెట్టారని బాధితురాలి సోదరుడి మర్మాంగం కోసేశారు
Rowdy Attacks Youth
Ram Naramaneni
|

Updated on: Jul 03, 2021 | 3:56 PM

Share

ఉత్తర్​ప్రదేశ్​లోని సుల్తాన్​పుర్​ జిల్లా అర్జున్​పుర్​లో దారుణ ఘటన జరిగింది. తమపై కేసు పెట్టారన్న కోపంతో ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసేశారు కొందరు దుండగులు. గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్నోలోని ట్రోమా సెంటర్​లో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. వివరాల్లోకి వెళ్తే… ప్రతాప్​గఢ్​ జిల్లా ఆసపుర దేవసారా గ్రామానికి చెందిన ఓ యువతిని 2019లో నిందితులు గ్యాంగ్ రేప్ చేశారు. దీంతో వారిపై కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం కోర్టులో ఈ కేసుపై విచారణ సాగుతోంది. ఈ క్రమంలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు.. కేసును వెనక్కు తీసుకోవాలని బాధిత కుటుంబంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చారు. రాజీ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. బాధిత కుటుంబం న్యాయపరంగానే తేల్చుకుంటామని స్ఫష్టం చేయడంతో.. కేసు ఉపసంహరించుకోకపోతే చంపేస్తాం అంటూ యువతి సోదరుడిని బెదిరించారు. కానీ యువతి సోదరుడు అందుకు తిరస్కరించాడు. దీంతో ఇటీవల జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులు అతనిపై కక్ష సాధించేందుకు సిద్ధమయ్యారు.

బాధితుడు గత జూన్ 26న అర్జున్​పుర్​లోని అతని అత్తవారి ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు.. పక్కా స్కెచ్ వేసి అతనిపై దాడి చేసి మర్మాంగాన్ని కోసేశారు. సమాచారం అందుకున్న అధికారులు బాధితుడిని లక్నోలోని ట్రోమా సెంటర్​కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలోని నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also Read:  భర్త మారతాడని ఎన్నాళ్లో ఓపిక బట్టింది.. చివరకు తట్టుకోలేక కత్తి బట్టి మట్టుబెట్టింది

కట్నంగా స్విఫ్ట్​ కారును ఇవ్వలేదని ఓ వరుడు ఊహించని పని చేశాడు..