AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mancherial: భర్త మారతాడని ఎన్నాళ్లో ఓపిక బట్టింది.. చివరకు తట్టుకోలేక కత్తి బట్టి మట్టుబెట్టింది

ఈ దునియా పాడుగానూ దినాం గింత అధ్వాన్నంగా తయారైతుందేంది?. ఆఖరి దాకా కలిసుంటామని ఏడడుగులు నడిచి  దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన జంటలు మధ్యలోనే బంధాలను విడిచిపెడుతున్నారు.

Mancherial: భర్త మారతాడని ఎన్నాళ్లో ఓపిక బట్టింది.. చివరకు తట్టుకోలేక కత్తి బట్టి మట్టుబెట్టింది
Ram Naramaneni
|

Updated on: Jul 03, 2021 | 3:43 PM

Share

ఈ దునియా పాడుగానూ దినాం గింత అధ్వాన్నంగా తయారైతుందేంది?. ఆఖరి దాకా కలిసుంటామని ఏడడుగులు నడిచి  దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన జంటలు మధ్యలోనే బంధాలను విడిచిపెడుతున్నారు. భాగస్వాములపై ప్రేమ కాదు ధ్వేషం పెంచుకుంటున్నారు. ఆలుమగల బంధం మధ్యలోనే పుటుక్కుమంటుంది. విడాకుల విషయం పక్కన బెడితే.. భార్యను భర్త చంపడం.. భర్తను భార్యే అంతమొందించడం లాంటి ఘటనలు నిత్యం తారసపడుతున్నాయి.  ప్రాణ భయం పగోల్లతోనే కాదు ఇప్పుడు ఇంట్లో వాళ్లతో కూడా తయారైంది. అణిగిమణిగి ఉంటుంది కదా అని పెండ్లాన్ని ఇష్టం వచ్చినట్లు అంటే చెల్లదంటున్నారు ప్రజంట్ జనరేషన్ ఆడవాళ్లు. ఆళికి కోపం వచ్చి తిరగబడితే భద్రకాళి అవుతుందని హెచ్చరిస్తున్నారు.  భార్యలను భర్తలు ఇష్టం వచ్చినట్లు కోడుతూ ఉంటే, వేధిస్తూ ఉంటే చూస్తే ఊరుకోవాలా అంటున్నారు.  తాజాగా మంచిర్యాల జిల్లాలో ఓ భర్తను భార్యే కత్తితో పొడిచి చంపింది.

వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట కాలనీలో కొప్పుల నాగరాజు అనే వ్యక్తిని తన భార్యే కత్తితో పొడిసి హత్య చేసింది. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు పోయి భర్త పెట్టే బాధలు భరించలేక చంపేశానని.. తనను అరెస్ట్ చేయమంటూ లొంగిపోయింది.  కొన్నాళ్లుగా ఈ దంపతులు మధ్య గొడవలు జరుగుతున్నాయట. ఇంట్లో భార్యను చీటికి మాటికి కొట్టుడు షురూ చేసిండట భర్త. ఇగ మార్తడు.. అగ మార్తడు అనుకుని ఇంతకాలం ఓపిక పట్టిన ఆమె సహనం నశించి భర్తను హత్య చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇంట్లో ఆడోళ్లను గొట్టే ఓ మొగోళ్లూ జర పైలం.

Also Read: బ్యాంకులో కామ పిశాచి.. ఆర్ధిక అవసరాల కోసం వచ్చేవారే మేనేజర్ టార్గెట్.. CCTV కెమెరా దృశ్యాల్లో కామాంధుడు

కట్నంగా స్విఫ్ట్​ కారును ఇవ్వలేదని ఓ వరుడు ఊహించని పని చేశాడు..