Viral News: కట్నంగా స్విఫ్ట్ కారును ఇవ్వలేదని ఓ వరుడు ఊహించని పని చేశాడు..
ఈ మధ్య పీటల మీద కూడా చాలా పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. పెళ్లి అయిన తర్వాత ప్రియుడిని పిలిచి ముద్దు పెట్టడం, 'తాళి కట్టొద్దు.. ప్రియుడు వచ్చి నన్ను తీసుకెళ్తాడు' అని వధువులు...
ఈ మధ్య పీటల మీద కూడా చాలా పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. పెళ్లి అయిన తర్వాత ప్రియుడిని పిలిచి ముద్దు పెట్టడం, ‘తాళి కట్టొద్దు.. ప్రియుడు వచ్చి నన్ను తీసుకెళ్తాడు’ అని వధువులు అన్న ఘటనలు మనం ఇటీవల విన్నాం. ఇక తమకు నచ్చిన కానుకలు, కట్నాలు ఇవ్వలేదని.. మొగ పెళ్లివారు పీటల మీద పెళ్లి ఆపేసిన ఘటనలు అయితే కోకొల్లలు. తాజాగా అటువంటి ఘటనే హర్యానా ఫరీదాబాద్‌లోని బల్లభగడ్లో జరిగింది. కట్నంగా స్విఫ్ట్ కారుకు బదులు బుల్లెట్ బైక్ ఇచ్చారని.. వివాహన్ని ఆపేశాడు ఓ వరుడు.
అసలు ఏం జరిగిందంటే…
ఉభయులూ పెళ్లికి ముందే కట్నకానుకల విషయాల గురించి మాట్లాడుకుని ఒక మాట మీదకు వచ్చారు. వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. తనకు కట్నం కింద స్విఫ్ట్ కారు ఇవ్వాలని పెళ్లి కొడుకు.. కోరడంతో వధువు కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. తమ ఆర్థిక స్థోమత సరిగాలేదని బుల్లెట్ బైక్ కట్నంగా ఇస్తామని ఒప్పుకున్నారు. ఈ క్రమంలో వివాహం జరిగే రోజున.. పెళ్లి మండపంలో కారు ఉందో లేదో చూసి రమ్మంటూ.. తన వాళ్లను పంపాడు వరుడు. దీంతో అక్కడికి చేరుకున్న పెళ్లి కుమారుడి తరఫువారు.. బుల్లెట్ ఉండటం చూసి వెనక్కి వెళ్లిపోయారు. అదే విషయాన్ని వరుడితో చెప్పారు. కొంత సమయం తర్వాత పెళ్లి కొడుకు ఫోన్ చేసి.. ‘కారు ఇస్తేనే పెళ్లి జరుగుతుంది. లేకపోతే జరగదు’ అని చెప్పాడు. దీంతో మంగళ వాయిద్యాలు, మేళలతో హడావుడిగా ఉండాల్సిన మండపం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అంతవరకు ఆనందంలో మునిగి తేలిన వధువు బంధువులు ఆందోళనలో పడ్డారు. ఈ సంఘటన తర్వాత వధువు కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రి కూలీ పని చేస్తారని.. అయినప్పటికీ అప్పు తీసుకుని బుల్లెట్ బైక్ ఇచ్చామని పోలీసులకు విన్నవించాడు వధువు సోదరుడు. కట్నంపై దురాశతో తన సోదరి పెళ్లి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే లిఖితపూర్వక ఫిర్యాదు మేరకే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
Also Read: ‘ఎండిపోయిన లావా ”రాతికోట” లా మారిపోయిందే ! మహారాష్ట్రలో నాటి అగ్నిపర్వత విస్ఫోట ఫలితం ?