Spiders Smuggling: డ్రగ్స్, గోల్డ్, నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్.. కాదు ఇప్పుడు అమెరికన్ స్పైడర్స్.. ఉలిక్కిపడిన చెన్నై ఎయిర్ పోర్ట్ అధికారులు
ఇంత కాలం మనం డ్రగ్స్, గోల్డ్, నక్షత్ర తాబేళ్ల లాంటివి స్మగ్లింగ్ చేయడం చూశాం.. కానీ ఇప్పుడు అమెరికన్ స్పైడర్స్‌ను స్మగ్లింగ్ చేస్తున్నారు. అవును ఇది నిజం.. ప్రపంచంలో అత్యంత ప్రమాదాకరమైన స్పైడర్స్‌లో అవి కూడా ఒకటి..ఒకటి..రెండు కాదు. ఏకంగా 107 సాలిళ్లు. ఎవరు పంపారు..? ఎందుకు పంపారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఇంత కాలం మనం డ్రగ్స్, గోల్డ్, నక్షత్ర తాబేళ్ల లాంటివి స్మగ్లింగ్ చేయడం చూశాం.. కానీ ఇప్పుడు అమెరికన్ స్పైడర్స్‌ను స్మగ్లింగ్ చేస్తున్నారు. అవును ఇది నిజం.. ప్రపంచంలో అత్యంత ప్రమాదాకరమైన స్పైడర్స్‌లో అవి కూడా ఒకటి.. ఒకటి.. రెండు కాదు.. ఏకంగా 107 అమెరికన్ స్పైడర్స్.. అవును.. స్పైడర్స్‌ను స్మగ్లింగ్ చేయడమేంటి అనుకుంటున్నారా..? ఎందుకో ఏంటో ఈ స్టోరీ ఇక్కడ చదవండి.. చెన్నై ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో ఈ అరుదైన అమెరికన్ స్పైడర్స్‌ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. పోలెండ్ నుంచి వచ్చిన ఓ పార్సిల్‌లో ఈ అమెరికన్ స్పైడర్స్‌ను గుర్తించారు. అసలు ఈ పార్సిల్ ఎంత కట్టుదిట్టంగా ప్యాక్ చేశారు. లోపల థర్మాకోల్‌తో ఓ బాక్స్.. దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చెయ్యగా.. అందులో సిల్వర్ ఫాయిల్‌లో కాటన్ పెట్టి దాని మధ్యలో.. ఇంజెక్షన్ ఇచ్చేందుకు వాడే ప్లాస్టిక్ వయల్స్ 107 ఉన్నాయి.
చిన్నచిన్న ప్లాస్టిక్ సిరెంజు లాంటి బాటిల్స్‌లో 107 బతికి ఉన్న బ్లాక్ స్పైడర్స్‌ను పెట్టారు స్మగ్లర్లు.ఈ సాలిళ్లు నార్త్ అమెరికా, మెక్సికోలో మాత్రమే ఉండేవని గుర్తించారు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారులు. పోలెండ్ నుంచి తమిళనాడులోని అరుపుకోట్టై ప్రాంతానికి చెందిన వ్యక్తి అడ్రస్ పేరుతో ఈ పార్శిల్ వచ్చింది. మొత్తం నాలుగు రకాల 107 స్పైడర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని సంపన్న కుటుంబాలు పెంచుకుంటున్నాయని చెబుతున్నారు అధికారులు. స్మగ్లర్లు వీటిని సంపన్నులకు లక్షల రూపాయలకు అమ్ముతున్నట్లు సమాచారం.
వాటి విలువ 7.6 లక్షల దాకా ఉంటుందని తెలిపారు. ఆ సాలీళ్ల దిగుమతికి సంబంధించి ఎలాంటి అనుమతులూ, లైసెన్సులు, డాక్యుమెంట్లూ లేవని.. ఇదో ఇల్లీగల్ పార్శిల్‌గా తేల్చారు. అసలు దీన్ని తమిళనాడుకు ఎందుకు పంపారు..? ఎవరు పంపారు..? ఈ వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు అధికారులు.
Chennai Air Customs: 107 live spiders ( CITES listed Tarantulas) in a postal parcel arriving from Poland at FPO seized under Custom Act r/w FT(D&R) Act. #IndianCustomsatwork @nsitharaman @nsitharamanoffc @Anurag_Office @ianuragthakur @cbic_india @FinMinIndia pic.twitter.com/jF06loC06b
— Chennai Customs (@ChennaiCustoms) July 2, 2021