AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI ఖాతాదారులకు అలర్ట్.. ఆదివారం ఈ సేవలకు అంతరాయం

SBI Customers Alert: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? ఆన్‌లైన్ సేవలను వినియోగించుకుంటున్నారా..?

SBI ఖాతాదారులకు అలర్ట్.. ఆదివారం ఈ సేవలకు అంతరాయం
Sbi
Sanjay Kasula
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 03, 2021 | 6:55 PM

Share

SBI Customers Alert: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? ఆన్‌లైన్ సేవలను వినియోగించుకుంటున్నారా..? ఏవైనా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు జరపాలా? అయితే అలర్ట్… బ్యాంకింగ్ సేవలకు రేపు (ఆదివారం) అంతరాయం కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ డిజిటల్‌ సేవలకు అంతరాయం కలగనుంది. బ్యాంకుకు సంబంధించి నిర్వహణ పనుల నేపథ్యంలో బ్యాంకు డిజిటల్‌ చెల్లింపుల వేదికలైన ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యూపీఐ తదితర సేవలు ఆదివారం కొన్ని గంటల పాటు పరిమిత సయమంలో నిలిచిపోనున్నాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో ఆయా సేవల్లో ఆదివారం మధ్య అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ చేపడుతోంది. దీంతో ఆదివారం మధ్యాహ్నం 03 గంటల 25 నిమిషాల నుంచి 05 గంటల 50 నిమిషాల వరకు డిజిటల్‌ సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని బ్యాంకు తెలిపింది. తమకు సహకరించాలని ఖాతాదారులకు విజ్ఞప్తి చేసింది.

బ్యాంకుల్లో కార్యకలాపాలకు అంతరాయం తప్పదు. కాబట్టి ఖాతాదారులు, బ్యాంకుల్లో లావాదేవీలు జరపాలనుకునేవారు ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే అంతరాయానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం అవసరం.

ఇవి కూడా చదవండి : Tirath Singh Rawat: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ రాజీనామా.. ఎమ్మెల్యేగా ఎన్నికవ్వకపోవడంతో..

Darbhanga blast case: తండ్రి యోదుడు.. కొడుకులు మాత్రం కసాయిలు.. ఎందుకిలా..?