AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Arrested: బాలికను లైంగికంగా వేధించాడంటూ నటుడిపై కేసు నమోదు.. అరెస్ట్‌ చేసిన పోలీసులు.

Pracheen Chauhan: మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎన్ని రకాల చట్టాలు తీసుకొచ్చిన ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్‌ మాత్రం పడడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మరో నటుడిపై..

Actor Arrested: బాలికను లైంగికంగా వేధించాడంటూ నటుడిపై కేసు నమోదు.. అరెస్ట్‌ చేసిన పోలీసులు.
Pracheen Chauhan
Narender Vaitla
|

Updated on: Jul 03, 2021 | 2:00 PM

Share

Actor Arrested: మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎన్ని రకాల చట్టాలు తీసుకొచ్చిన ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్‌ మాత్రం పడడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మరో నటుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ప్రచీన్‌ చౌహాన్‌ అనే బాలీవుడ్‌ బుల్లితెర నటుడు ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించాడంటూ కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముంబయి పోలీసులు ప్రచీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం 354, 342, 323, 506 (2) సెక్షన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలీవుడ్‌ వర్గల్లో సంచలనంగా మారిన ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే బుల్లితెర యాంకర్‌గా పరిచయమైన 42 ఏళ్ల ప్రచీన్‌ చౌహన్‌ అనతికాలంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. కేవలం బుల్లితెరకే పరిమితం కాకుండా ఇటీవల ‘ప్యార్‌ కా పంచ్‌’ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించాడు. ఇక గతంలోనూ పెర్ల్‌ వి అనే టీవీ నటుడు కూడా మైనర్‌ బాలికపై లైంగికంగా వేధించాడనే ఆరోపనతో అరెస్ట్‌ అయ్యాడు. అయితే అతను తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. కొద్ది రోజుల వ్వవధిలోనే ఇలాంటి మరో ఘటన జరగడంతో చర్చనీయాంశంగా మారింది.

Also Read: Ramya Krishnan: రిపబ్లిక్ లో పవర్ ఫుల్ పాత్రలో రాజమాత.. సాయి ధరమ్ తేజ్ కు సవాల్ విసురుతున్న రమ్యకృష్ణ

SVR Rare Photo: యముని వేషంలో ఎస్వీఆర్ ను చూసి ప్రశంసించిన అప్పటి చైనా ప్రధాని.. ఫోటో వైరల్

Pawan kalyan: పవన్‌ కళ్యాణ్‌ రీమేక్‌ సినిమా టైటిల్‌ ఇదేనా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న కొత్త సినిమా టైటిల్‌.