Mudslide: ప్రళయం.. భారీ వర్షాలతో విరిగిపడుతున్న కొండచరియలు.. 19 మంది మిస్సింగ్.. షాకింగ్ వీడియో
19 missing as mudslide hits: జపాన్‌ను వారం నుంచి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. టోక్యో సమీపంలో
19 missing as mudslide hits: జపాన్‌ను వారం నుంచి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. టోక్యో సమీపంలో ఉన్న ఓ పట్టణంలో భారీగా కురిసిన వర్షాలతో.. మట్టి చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 19 మంది అదృశ్యమైనట్లు జపాన్ అధికారులు వెల్లడించారు. షిజువాకా జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనలో అనేకమంది మృతి చెందగా.. చాలా ఇళ్లు నేలమట్టమైనట్లు షిజుకా ప్రిఫెక్చర్ ప్రతినిధి తకామిచి సుగియామా పేర్కొన్నారు.
భారీ వర్షాలతో.. కొండ చరియలు భారీగా విరిగిపడ్డ భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఈ ప్రాంతం నుంచి చాలా మంది ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. కొండచరియలు వేగంగా దూసుకువస్తున్న భయంకర వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే.. ఇంకా చాలామంది అదృశ్యమైనట్లు పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
వీడియో..
— Chad (@ChadBlue83) July 3, 2021
చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఉదయం అంతా ఈ ప్రాంతంలో తీవ్రంగా వర్షం పడుతోందని దీంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. ఈ సహాయక చర్యల్లో భద్రతా దళాలు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొంటున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాంత వాసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: