‘రాతి బొమ్మ’ లా మారిపోనున్న చిన్నారి.. కదలలేని స్థితికి దారి తీస్తున్న అరుదైన వ్యాధి..షాక్ తిన్న పేరెంట్స్

బ్రిటన్ లో అందాలొలికే ఓ చిన్నారికి అరుదైన వ్యాధి సోకింది. జన్యు లోపం కారణంగా ఆ పసికందు శరీరం క్రమంగా 'రాయి' లా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

'రాతి బొమ్మ' లా మారిపోనున్న చిన్నారి.. కదలలేని స్థితికి దారి తీస్తున్న అరుదైన వ్యాధి..షాక్ తిన్న పేరెంట్స్
Baby Girl Turning To Stone
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 03, 2021 | 12:43 PM

బ్రిటన్ లో అందాలొలికే ఓ చిన్నారికి అరుదైన వ్యాధి సోకింది. జన్యు లోపం కారణంగా ఆ పసికందు శరీరం క్రమంగా ‘రాయి’ లా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు. లెక్స్ రాబిన్స్ అనే ఈ పసిపాప గత జనవరిలో జన్మించింది. అయితే మెదడు బయటి భాగంలో క్రమంగా ఎముకలతో కూడిన కణజాలం పెరుగుతుందని వారు అంటున్నారు. ఫైరో డిస్ ప్లేసియా ఆసిఫకన్స్ ప్రొగ్రెసివా అనే అత్యంత అరుదైన కణజాలం ఏర్పడుతున్నందున ఆమె కదలలేకపోతుందని వారు పేర్కొన్నారు. ఇది చివరకు శరీరం రాతిలా మారిపోవడానికి దారితీస్తుందట.. 20 లక్షల మందిలో ఒక్కరికి మాత్రం ఇలాంటిది సోకుతుందట.. తమ పాపకు సోకిన ఈ వ్యాధిని చూసి అలెక్స్, దవే రాబిన్స్ అనే ఆ పేరెంట్స్ కుమిలిపోతున్నారు. అసలు పుట్టినప్పుడే ఈ చిన్నారి తీరు సరిగా లేదని తాము భావించామని.. చేతి బొటనవేలితో బాటు ఇతర వేళ్ళను కదిలించలేకపోతోందని… కాళ్ళ భాగం కూడా దాదాపు అలాగే ఉందని వారు తెలిపారు. వీరు తమ బిడ్డకు గత ఏప్రిల్ లో ఎక్స్-రే తీయించగా..బొటన వేళ్ళు రెండుగా కలిసి ఉన్నాయని… పైగా కాలిభాగం కూడా ఈ రుగ్మత కారణంగా అవయవ లోపంలా కనిపిస్తోందని..ఫలితంగా సరిగా నడవజాలదని వెల్లడైంది.

ఈ పాప తన 20 ఏళ్ళ వయస్సు వరకు అలాగే మంచాన పడి ఉంటుందని.. జీవిత కాలం 40 ఏళ్ళు వయస్సు వరకు మాత్రమేనని డాక్టర్లు చెప్పారు. చిన్నారి ఎక్స్ రే రిపోర్టును అమెరికా లోని ల్యాబ్ కు పంపగా అది కూడా ఈ అరుదైన వ్యాధిని నిర్ధారించింది. పాపకు వ్యాక్సిన్లు ఇచ్చినా పని చేయవని కూడా తేలింది. తన 30 ఏళ్ళ కెరీర్ లో ఇలాంటి కేసును చూడడం ఇదే మొదటిసారని బ్రిటన్ లోని ప్రముఖ పీడియాట్రిక్ డాక్టర్ పేర్కొన్నారు. ఇక లేక్స్ వ్యాధి పట్ల వేలాది మంది జాలి చూపుతూ అవసరమైతే ఆమె వైద్యానికి సాయపడతామంటూ డొనేషన్లు కూడా పంపడానికి రెడీ అవుతున్నారట.

మరిన్ని ఇక్కడ చూడండి: మహారాష్ట్రలో కొత్త నత్త జాతి.. ముంబై శాస్త్రవేత్త పేరునే పెట్టిన రీసెర్చర్లు.. యూరప్ జర్నల్ లో పరిశోధనా ఫలితాలు

ICICI Salute Doctors: వైద్య వృత్తిలో ఉన్న వారికి భారీగా రుణాలు.. ‘సెల్యూట్‌ డాక్టర్స్‌’ పేరుతో ఐసీఐసీఐ కొత్తగా..