మహారాష్ట్రలో కొత్త నత్త జాతి.. ముంబై శాస్త్రవేత్త పేరునే పెట్టిన రీసెర్చర్లు.. యూరప్ జర్నల్ లో పరిశోధనా ఫలితాలు

మహారాష్ట్రలో కొత్త నత్త జాతి.. ముంబై శాస్త్రవేత్త పేరునే పెట్టిన రీసెర్చర్లు.. యూరప్ జర్నల్ లో పరిశోధనా ఫలితాలు
New Snail Variety

ఇప్పటివరకూ ఎవరికీ తెలియని లకొత్త నత్త జాతిని మహారాష్ట్రలో పరిశోధకులు కనుగొన్నారు. పశ్చిమ ఘాట్ ల లోని సింధు దుర్గ్ జిల్లాలో గల అంబోలీ గ్రామ సమీపంలోని అడవుల్లో కనబడిన అరుదైన ఈ నెట్టాను చూసి వారు ఆశ్చర్యపోయారు.

Umakanth Rao

| Edited By: Phani CH

Jul 03, 2021 | 12:57 PM

ఇప్పటివరకూ ఎవరికీ తెలియని కొత్త నత్త జాతిని మహారాష్ట్రలో పరిశోధకులు కనుగొన్నారు. పశ్చిమ ఘాట్ ల లోని సింధు దుర్గ్ జిల్లాలో గల అంబోలీ గ్రామ సమీపంలోని అడవుల్లో కనబడిన అరుదైన ఈ నత్తను చూసి వారు ఆశ్చర్యపోయారు. దీన్ని ముంబైకి చెందిన డా.వరాడిగిరి అనే శాస్త్రవేత్త పేరిట ‘వరాడియా’ అని వ్యవహరిస్తున్నారు. రకరకాల నత్తల జాతులను అధ్యయనం చేయడంలో ఆయన విశేష కృషి చేశారని అమృత్ భోపాలే అనే రీసెర్చర్ చెప్పారు. అంబోలి గ్రామానికి కూడా పేరు తెచ్చినందుకు ఈ నత్త జాతిని ‘వరాడియా అంబోలియెన్ సిన్’ అని కూడా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. ఈ భూతలం మీది ఈ సరికొత్త జీనస్..నూతన జాతికి చెందిననత్త వివరాలను..తమ పరిశోధనా ఫలితాలను వీరు యూరోపియన్ జర్నల్ లో ప్రచురించారు. హిరాయెంకేశీ అనే ఆలయ సమీపంలోని దట్టమైన అడవుల్లో ఇది కనిపించిందని. 7 సెంటి మీటర్ల పొడవు ఉందని పరిశోధకులు వెల్లడించారు. ఈ నత్త టైపును కనుగొన్న రీసెర్చర్లలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు తేజస్ థాకరే కూడా ఉన్నారు. థాకరే వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ కి ఆయన నేతృత్వం వహిస్తున్నారు.

ఈ జాతి నత్తల పైని పెంకు (షెల్) వంటి భాగం చర్మంతో కప్పి ఉంటుందని.. దాన్ని ఈ జీవి వెనక్కి తీసుకోగలుగుతుందని అంటున్నారు. ఇతర నత్తలలో ఇలా ఉండదని.. వాటి పెంకు భాగం పూర్తిగా డొల్లగా ఉంటుందని భోపాలే వెల్లడించారు. ఈ నత్త రాత్రిపూట చాలా చురుకుగా ఉంటుందని.. క్రిములను ఆహారంగా భక్షిస్తుందని ఆయన చెప్పారు. మహారాష్ట్రతో బాటు గోవా, కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లోనూ ఇది కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ICICI Salute Doctors: వైద్య వృత్తిలో ఉన్న వారికి భారీగా రుణాలు.. ‘సెల్యూట్‌ డాక్టర్స్‌’ పేరుతో ఐసీఐసీఐ కొత్తగా..

Illegal Immigrants : విజయవాడలో అక్రమంగా సంచరిస్తున్న బంగ్లాదేశీ యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu