AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI Salute Doctors: వైద్య వృత్తిలో ఉన్న వారికి భారీగా రుణాలు.. ‘సెల్యూట్‌ డాక్టర్స్‌’ పేరుతో ఐసీఐసీఐ కొత్తగా..

ICICI Salute Doctors: వైద్య వృత్తిలో ఉన్న వారికి దేశీయ ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం పలు రకాల ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. సెల్యూట్‌ డాక్టర్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్లతో వైద్యు వృత్తిలో ఉన్న వారికి భారీగా రుణాలు అందించనున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించింది.

ICICI Salute Doctors: వైద్య వృత్తిలో ఉన్న వారికి భారీగా రుణాలు.. 'సెల్యూట్‌ డాక్టర్స్‌' పేరుతో ఐసీఐసీఐ కొత్తగా..
Icici Offers
Narender Vaitla
|

Updated on: Jul 03, 2021 | 12:26 PM

Share

ICICI Salute Doctors: వైద్య వృత్తిలో ఉన్న వారికి దేశీయ ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం పలు రకాల ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. సెల్యూట్‌ డాక్టర్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్లతో వైద్యు వృత్తిలో ఉన్న వారికి భారీగా రుణాలు అందించనున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో ఓ వైద్య విద్యార్థి స్థాయి నుంచి ఆసుపత్రి యజమాని వరకు అందరికీ మేలు జరిగేలా ఈ రుణాలను అందించనున్నట్లు ఐసీఐసీఐ లయబిలిటీస్‌ విభాగం హెడ్‌ ప్రణవ్‌ మిశ్రా తెలిపారు. కేవలం వైద్యుల కోసమే ఈ ప్రత్యేక ఆఫర్లు తీసుకొచ్చినట్లు ప్రణవ్‌ చెప్పుకొచ్చారు. నేషనల్‌ డాక్టర్స్‌ డే రోజున ఈ సరికొత్త ఆఫర్లను ప్రకటించారు.

సెల్యూట్‌ డాక్టర్స్‌లో భాగంగా అందిస్తోన్న ఆఫర్లు..

* మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ. 10 కోట్ల వరకు రుణాలను అందించనున్నారు. దరఖాస్తుదారులు ఐసీఐసీఐ కస్టమర్లు కాకపోయినప్పటికీ ఈ సదుపాయాన్ని కల్పించారు. ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం హెచ్‌.సి.ఎఫ్‌ అని టైప్‌ చేసి 567677కు ఎస్‌ఎమ్‌ఎస్‌ చేయొచ్చు. * ఇక ఆసుపత్రి లేదా క్లినిక్‌ మాడిఫికేషన్‌, వైద్య పరికరాల కొనుగోలుతో పాటు ఇతర వ్యాపార సంబంధిత ఖర్చుల కోసం బ్యాంకు వ్యాపారం రుణ రూపంలో రూ. 40 లక్షలు అందించనున్నారు. ఇందులో భాగంగా తక్షణమే రుణ సదుపాయం కల్పించనున్నారు. * వైద్య వృత్తిలో ఉన్న వారికి రూ. 25 లక్షల వరకు వ్యక్తిగత రుణం ఇస్తున్నారు. ఇందుకోసం సాధారణ ఆన్‌లైన్ డాక్యుమెంటేషన్ , ప్రాసెసింగ్‌ సరిపోతుంది. * ‘డాక్టర్ సెలెక్ట్ ఐస్‌మార్ట్ ఎడ్యుకేషన్ లోన్’ పేరుతో ఎడ్యుకేషన్‌లోన్‌ను కూడా అందిస్తోంది. దీని ద్వారా రూ. కోటి వరకు రుణం పొందే అవకాశం కల్పించారు. అలాగే రూ. 50 లక్షల వరకు ఆటో లోన్‌ సదుపాయాన్ని కల్పించారు. * హోమ్‌ లోన్‌లో భాగంగా రూ. 5 కోట్ల వరకు రుణాన్ని అందించనున్నారు. నూతన ఇంటి నిర్మాణదారులకే కాకుండా మార్టేజ్‌, హోమ్‌ లోన్‌ బ్యాలన్స్‌ ట్రాన్స్‌ఫర్‌, లోన్‌ అగేనెస్ట్ ప్రాపర్టీ వంటి అవకాశాన్ని కూడా కల్పించారు.

Also Read: JIO New Offer: జియో కొత్త ఆఫర్.. అత్యవసర సమయంలో డేటా.. డబ్బులు తర్వాత చెల్లించే అవకాశం.

SBI customers ALERT!: SBI ఖాతాదారులకు అలర్ట్.. ఆదివారం ఈ సేవలకు అంతరాయం

LIC Housing Loan: భారీగా హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లను తగ్గించిన ఎల్‌ఐసీ.. వెంటనే త్వరపడండి. ఎందుకంటే ఈ అవకాశం.

తునిలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫల యత్నం
తునిలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫల యత్నం
12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.